ఇస్రో-నాసా ఐఎ్‌సఎస్ మిషన్.. భారత వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ పూర్తి
ABN, Publish Date - Dec 01 , 2024 | 01:48 AM
భారత, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)కు చేపట్టనున్న యాక్సియమ్-4 మిషన్‌కు ఎంపిక
బెంగళూరు, నవంబరు 30: భారత, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎ్‌స)కు చేపట్టనున్న యాక్సియమ్-4 మిషన్‌కు ఎంపిక చేసిన ఇద్దరు భారతీయ వ్యోమగాములు విజయవంతంగా ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకున్నారని ఇస్రో వెల్లడించింది. గగన్‌యాత్రీలుగా పిలిచే ప్రైమ్ గ్రూపు కెప్టెన్ సుభాన్షు శుక్లా, బ్యాకప్ గ్రూపు కెప్టెన్ ప్రశాంత్ బాలక్రిష్ణన్ ఆగస్టు మొదటి వారం నుంచి అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రాథమిక దశలో మిషన్ సంబంధిత గ్రౌండ్ ఫెసిలిటీ టూర్లపై అవగాహన, మిషన్ ప్రయోగ దశల అవలోకనం, స్పేస్‌ఎక్స్ సూట్ ఫిట్ తనిఖీలు, అంతరిక్ష ఆహార ఎంపికలపై శిక్షణ పూర్తి చేసుకున్నారని ఇస్రో తెలిపింది. తర్వాతి దశలో ఐఎ్‌సఎ్‌సకు చెందిన యూఎస్ ఆర్బిటల్ సెగ్మెంట్‌లో మిగిలిన మాడ్యూల్స్‌ను పరిష్కరించడం, మైక్రో గ్రావిటీలో పరిశోధనలు చేయడంపై శిక్షణనిస్తారు.
Updated Date - Dec 01 , 2024 | 01:48 AM