Akhilesh Yadav: లోక్ సభ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్..!!.. అక్కడి నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు..??
ABN, Publish Date - Feb 26 , 2024 | 03:38 PM
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచే పోటీ చేసిన అఖిలేష్ విజయం సాధించారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన అజంగఢ్ సీటును వదులుకున్నారు. స్థానం ఖాళీ అవడంతో అజంగఢ్ లో ఈసీ ఉప ఎన్నిక నిర్వహించగా ఈ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది.
అజంగఢ్ ఉప ఎన్నికల్లో బీఎస్పీ నుంచి షా ఆలం అలియాస్ గుడ్డు జమాలీ, సమాజ్‌వాదీ పార్టీ ధర్మేంద్ర యాదవ్, బీజేపీ నుంచి దినేష్‌లాల్ నిరాహువాలు బరిలోకి దిగారు. హోరాహోరీగా జరిగిన పోరులో బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ గెలుపొందారు. ఈ క్రమంలో బీఎస్పీలో కొనసాగుతున్న షా ఆలమ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అఖిలేష్ యాదవ్ ఇప్పటికే అజంగఢ్ నుంచి పోటీ చేశారని, మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడిపోతారని అజంగఢ్ ఎంపీ దినేష్ లాల్ అన్నారు.
మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొనున్నారు. ప్రియాంక గాంధీ సైతం ఈ యాత్రలో పాల్గొన్నారు. ఇద్దరు కీలక నేతలు రాహుల్ యాత్రలో పాల్గొనడం కాంగ్రెస్, ఎస్పీ పార్టీలకు కలిసి వస్తోందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 26 , 2024 | 05:57 PM