ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై జేపీసీ చైర్మన్‌గా జగదాంబిక పాల్

ABN, Publish Date - Aug 13 , 2024 | 03:18 PM

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024పై అధ్యయనానికి ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి బీజేపీ నేత జగదంబికా పాల్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024 (Waqf Amendment bill-2024)పై అధ్యయనానికి ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి బీజేపీ నేత జగదంబికా పాల్ (Jagadambika pal) చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.


ఆగస్టు 8వ తేదీన ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపాదిత సవరణలపై స్వల్ప చర్చ జరిగింది. అనంతరం బిల్లుపై అధ్యయనానికి 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. వచ్చే శీతాకాల సమావేశాల తొలివారం చివరి రోజు నివేదిక అందించాలని గడువు విధించారు. కమిటీలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు.

Bangalore: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ.. ఐదుగురికి ఉద్వాసన..?


జేపీసీలో లోక్‌సభ సభ్యులు వీరే..

లోక్‌సభ నుంచి ప్యానెల్‌లో 12 మంది సభ్యులు ఎన్డీయేకు చెందిన వారుండగా, వారిలో 8 మంది బీజేపీకి చెందిన వారున్నారు. 9 మంది విపక్ష సభ్యులకు జేపీసీలో చోటు కల్పించారు. జేపీసీ లోక్‌సభ సభ్యుల్లో జగదాంబికా పాల్ (చైర్మన్), నిషాకాంత్ డూబే, తేజస్వి సూర్య, అపరాజిత సారంగి, అభిజిత్ గంగోపాధ్యాయ్, సంజయ్ జైశ్వాల్, దిలీప్ సైకియా, డీకే అరుణ ఉండగా, వీరంతా బీజేపీకి చెందినవారు. కాంగ్రెస్ సభ్యుల్లో గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మొమహ్మద్ జావెద్ ఉండగా, కల్యాణ్ బెనర్జీ (టీఎంసీ), ఎ.రాజా (డీఎంకే), లావు శ్రీ కృష్ణ దేవరాయలు (టీడీపీ), దిలేశ్వర్ కమైత్ (జేడీయూ), అరవింద్ సావత్ (శివసేన-యూబీటీ), సురేష్ మెహత్రె (ఎన్సీపీ శరద్ పవార్), నరేష్ మహస్కే (శివసేన), అరుణ్ భారతి (ఎల్‌జేపీ-రామ్ విలాస్), అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం) ఇతర సభ్యులుగా ఉన్నారు.


జేపీసీలో రాజ్యసభ సభ్యులు

రాజ్యసభ నుంచి జేపీసీలో బీజీపీ నుంచి నలుగురు, విపక్షాల నుంచి నలుగురు, ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు. బ్రిజ్ లాల్, మేథా విక్రమ్ కులకర్ణి, గులాం అలీ, రాధా మోహన్ దాస్ అగర్వాల్ (వీరంతా బీజేపీ), సైయద్ నసీర్ హుస్సేన్ (కాంగ్రెస్), మొహమ్మద్ నదీముల్ హఖ్ (టీఎంసీ), వి.విజయసాయి రెడ్డి (వైఎస్ఆర్సీపీ), ఎం.మొహమ్మద్ అబ్దుల్లా (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), ధర్మశాల వీరేంద్ర హెగ్డే నామినేటెడ్ సభ్యుడుగా ఉన్నారు.

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2024 | 03:22 PM

Advertising
Advertising
<