ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jaishankar: నెహ్రూ హయాంలోనే చైనా ఆక్రమణ’

ABN, Publish Date - May 18 , 2024 | 05:57 AM

కాంగ్రెస్‌ పార్టీపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మరోసారి ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణకు దేశ భూభాగాన్ని కోల్పోయామన్నారు

ఇప్పుడు మోదీని దోషి అంటున్నారు

కాంగ్రె్‌సవి ద్వంద్వ ప్రమాణాలు: జైశంకర్‌

న్యూఢిల్లీ, మే 17: కాంగ్రెస్‌ పార్టీపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మరోసారి ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణకు దేశ భూభాగాన్ని కోల్పోయామన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

అరుణాచల్‌ప్రదేశ్‌ సమీపంలో చైనా ఒక మోడల్‌ విలేజ్‌ను నిర్మిస్తోందని, తూర్పు లద్ధాఖ్‌లోని భూభాగాన్ని కబ్జా చేస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఆయన దీటుగా స్పందించారు. మోడల్‌ గ్రామాన్ని నిర్మిస్తున్న ప్రాంతాన్ని 1950వ దశకం చివర్లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు చైనా స్వాధీనం చేసుకుందని చెప్పారు.

వివాదానికి కేంద్రంగా మారిన ఈ గ్రామం లాంగ్జు అనే ప్రాంతంలో ఉందన్నారు. పార్లమెంట్‌ రికార్డులు పరిశీలించినా, సరిహద్దు వివాదంపై ఇంకేదైనా పుస్తకం చదివినా ఈ ప్రాంతాన్ని 1959లో చైనీయులు స్వాధీనం చేసుకున్న విషయం తెలుస్తుందని తెలిపారు.

దీనిపై 1959లో నెహ్రూ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ‘నన్ను క్షమించండి. అది నా చేతుల్లో నుంచి జారిపోయింది’ అని అన్నారని గుర్తుచేశారు. ‘ఇక వారు చెబుతున్న రెండో అంశం వంతెన. ప్యాంగాంగ్‌ సరస్సుకు ఉత్తరం వైపు ఒక వంతెనను నిర్మిస్తున్నారు. ఇది ఖుర్నాక్‌ కోటకు సమీపంలో ఉంది. 1962 యుద్ధంలో చైనా ఖుర్నాక్‌ కోట ప్రాంతాన్ని ఆక్రమించుకొంది’ అని జైశంకర్‌ పేర్కొన్నారు.

Updated Date - May 18 , 2024 | 05:57 AM

Advertising
Advertising