New York: కాలిఫోర్నియా వర్సిటీలో ‘జై శ్రీరామ్’ నినాదాలు
ABN, Publish Date - May 02 , 2024 | 06:15 AM
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి పాలస్తీనాకు అనుకూలంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులను ఎట్టకేలకు బుధవారం తొలగించారు.
న్యూయార్క్, మే 1: అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి పాలస్తీనాకు అనుకూలంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులను ఎట్టకేలకు బుధవారం తొలగించారు. మరోవైపు లాస్ ఏంజెలి్‌సలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల, వ్యతిరేక విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. ముష్ఠిఘాతాలు, కుర్చీలు, కర్రలతో కొట్టుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఘర్షణ సందర్భంగా ఇజ్రాయల్ అనుకూల విద్యార్థి ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన వీడియో వైరల్‌గా మారింది.
పాలస్తీనా అనుకూల విద్యార్థి ఒకరు భారత వ్యతిరేక నినాదాలు చేయడంతో, దానికి కౌంటర్‌గా ఇజ్రాయల్ అనుకూల విద్యార్థి ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. ఇజ్రాయల్ జెండాను కప్పుకొన్న ఆ విద్యార్థి పేరు శయన్ ఆలి కృష్ణ. పాకిస్థాన్‌లో జన్మించారు. కాగా, అమెరికా వ్యాప్తంగా ఇతర యూనివర్సిటీల్లో బుధవారం కూడా పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటింది.
Updated Date - May 02 , 2024 | 06:15 AM