Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు
ABN, Publish Date - Dec 11 , 2024 | 03:02 PM
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం పిటిష్టమైన చర్యలు చేపట్టింది. అందుకు 2026, మార్చి మాసాంతం లోపు లక్ష్యంగా కేంద్రం నిర్దేశించుకొంది.
రాయ్‌పూర్, డిసెంబర్11:ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో అమర్చిన మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన సైనికులను ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి పోలీస్ ఉన్నతాధికారులు తరలించారు. బుధవారం ఉదయం గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామ సమీపంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. గాయపడిన జవాన్లు.. మంగ్లు కుడియం, యోగేశ్వర్ షోరిగా గుర్తించారు.
Also Read: పేర్ని నాని సతీమణిపై పోలీసులు కేసు నమోదు
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం పిటిష్టమైన చర్యలు చేపట్టింది. అందుకు 2026, మార్చి మాసాంతం లోపు లక్ష్యంగా కేంద్రం నిర్దేశించుకొంది. ఈ నేపథ్యంలో లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులను కేంద్రం పిలుపు నిచ్చింది. మరోవైపు మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ కగార్‌ను తీసుకు వచ్చింది.
Also Read : కాంగ్రెస్‌తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం
Also Read: హిందువులపై దాడులు.. స్పందించిన బంగ్లాదేశ్
ఈ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది. అయితే ఛత్తీస్‌గఢ్‌లతో మాత్రం వారి ప్రాబల్యం తీవ్రంగా ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో వారి నిర్మూలనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో భారీగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి.
Also Read : పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..
Also Read: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు
ఈ ఎన్‌కంటర్ ద్వారా ఇప్పటికే మావోయిస్టులకు భారీ నష్టం జరగగా.. పోలీసులు, భద్రతా సిబ్బంది సైతం భారీగా ప్రాణాలు కోల్పోయారు. దాంతో పోలీసులు, భద్రత దళాలపై పైచెయ్యి సాధించేందుకు మావోయిస్టులు సైతం ప్రతి వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. అందులోభాగంగానే బుధవారం మందు పాత్ర పేలడం.. ఇద్దరు జవాన్లు గాయపడడం జరిగింది.
For National news And Telugu News
Updated Date - Dec 11 , 2024 | 03:02 PM