LokSabha Elections: బీజేపీ షోకాజ్ నోటీసు.. స్పందించిన జయంత్ సిన్హా
ABN, Publish Date - May 23 , 2024 | 05:01 PM
ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయకపోవడం, ఓటు హక్కు వినియోగించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు జయంత్ సిన్హా స్పందించారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయకపోవడం, ఓటు హక్కు వినియోగించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు జయంత్ సిన్హా స్పందించారు. బీజేపీ తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల విదేశాల్లో ఉండవలసి వచ్చిందన్నారు.
ఆ క్రమంలో తన ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నట్లు తెలిపారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తన నిర్ణయాన్ని ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించానని చెప్పారు. ఈ ప్రకటన అనంతరం జార్ఖండ్ బీజేపీలోని ఓ సీనియర్ నాయకుడు కానీ, ఎంపీ, ఎమ్మెల్యే కానీ వచ్చి తనను సంప్రదించలేదన్నారు.
AP Elections: పిన్నెల్లి ఇలా.. ఎలా దొరికిపోయాడు..!
బీజేపీ ఓ వేళ తనను కావాలనుకుంటే.. ఎవరో ఒకరు తనను సంప్రదించే వారని జయంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. కానీ అలాంటిది ఏమి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎన్నికల కార్యక్రమాల్లో తాను పాల్గొనాలనుకుంటే బీజేపీ కచ్చితంగా తనను సంప్రదించేదన్నారు.
కానీ అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. ఇక పార్టీ కార్యక్రమాల్లో.. ర్యాలీల్లో.. బహిరంగ సభల్లో పాల్గొనాలంటూ తనను ఎవరు ఆహ్వానించలేదని జయంత్ సిన్హా ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.
LokSabha Elections: మళ్లీ మేమే వస్తాం
మరోవైపు హజారీబాగ్ లోక్‌సభ అభ్యర్థిగా మనీష్ జైశ్వాల్ పేరును బీజేపీ ప్రకటించిందని చెప్పారు. అనంతరం జైశ్వాల్‌కు తాను కాంగ్రాట్స్ కూడా చెప్పానన్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఆయనకు మద్దతు సైతం ఇస్తున్నట్లు ప్రకటించానని గుర్తు చేసుకున్నారు.
ఇక మే 1వ తేదీన తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నానని.. అందుకోసం నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలంటూ ఏప్రిల్ 29న తనకు జైశ్వాల్ ఫోన్ చేసి ఆహ్వానించారన్నారు. కానీ ఆ విషయం తనకు చాలా ఆలస్యంగా గుర్తుకు వచ్చిందని జయంత్ సిన్హా చెప్పారు. దాంతో మే 2వ తేదీన తాను హజారీబాగ్‌లోని జైశ్వాల్ నివాసానికి వెళ్లానని... కానీ ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరన్నారు. దీంతో ఆయనకు తన మద్దతు ఉంటుందని జైశ్వాల్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి వచ్చానన్నారు.
Heatwave, Heavy rain: ఉత్తరాదిలో అలా.. దక్షిణాదిలో ఇలా..
అయితే మే 10వ తేదీన తన వ్యక్తిగత కారణాలతో విదేశాలకు వెళ్లవలసి వచ్చిందని జయంత్ సిన్హా వివరించారు. అదీకాక పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని తనను ఎవరు కోరలేదన్నారు. దీంతో ఎన్నికల వేళ.. తాను ఇక్కడ ఉండేందుకు కారణం కూడా కనిపించలేదని అబిప్రాయపడ్డారు.
జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాహుకు రాసిన లేఖలో జయంత్ సిన్హా.. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. గత ఎన్నికల్లో హజారీబాగ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా జయంత్ సిన్హా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
For More Latest National News and Telugu News..
Updated Date - May 23 , 2024 | 05:07 PM