Bangalore: హెచ్‌డీ రేవణ్ణ అరెస్టు..
ABN , Publish Date - May 05 , 2024 | 05:20 AM
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వ్యవహారంలో ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసింది.
దేవెగౌడ నివాసంలో అదుపులోకి ప్రజ్వల్ రాసలీలలు, బాధితురాలి
కిడ్నాప్ కేసుల్లో సిట్ చర్యలు ప్రజ్వల్‌పై బ్లూకార్నర్ నోటీసుపై సీబీ‘ఐ’
రేవణ్ణ, ప్రజ్వల్ ఇళ్లలో ఆధారాల సేకరణ జర్మనీ నుంచి దుబాయి..
ఆ తర్వాత హంగేరీకి ప్రజ్వల్
పజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ అరెస్టు రాసలీలలు, బాధితురాలి కిడ్నాప్ కేసుల్లో సిట్ చర్యలు
బెంగళూరు, మే 4(ఆంధ్రజ్యోతి): జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వ్యవహారంలో ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసింది. బాధితురాలి కిడ్నాప్, రాసలీలల కేసుల్లో ఏ1 నిందితుడైన హెచ్‌డీ రేవణ్ణ ముందస్తు బెయిల్ అభ్యర్థనను ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తిరస్కరించింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారులు.. పద్మనాభనగర్‌లోని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఇంట్లో ఉన్న రేవణ్ణను అరెస్టు చేశారు. సిట్ అధికారులు నమోదు చేసిన మొదటి కేసులో బెయిలబుల్ సెక్షన్లు ఉండటంతో రేవణ్ణ అరెస్టు సాధ్యం కాదని తొలుత భావించారు.
అయితే, బాధితురాలు కిడ్నా్‌పకు గురైన కేసులో ఆమెను ఇంటినుంచి తీసుకెళ్లిన రేవణ్ణ అనుచరుడు సతీశ్‌బాబణ్ణను శుక్రవారమే సిట్ అరెస్టు చేసింది. తాజాగా ఏ1 నిందితుడు రేవణ్ణను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, ప్రజ్వల్ రాసలీలల వ్యవహారంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య శనివారం సిట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజ్వల్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. దర్యాప్తు వివరాలను సిట్ అధికారులు సీఎంకు వివరించారు.
సీబీఐ త్వరలోనే ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయనుందని, తద్వారా ప్రజ్వల్ కదలికలను గుర్తించేందుకు సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. విమానాశ్రయాల నుంచి సమాచారం రాగానే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, ప్రజ్వల్ జర్మనీ నుంచి దుబాయ్‌కి అక్కడి నుంచి హంగేరీలోని బుడాపె్‌స్టకి వెళ్లి తలదాచుకున్నట్లు సిట్ గుర్తించింది. ఇదిలా ఉండగా, రేవణ్ణ, ప్రజ్వల్‌ల నివాసాలలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించి, పలు ఆధారాలను సేకరించారు.