J&K Assembly polls: కిషన్‌రెడ్డి అధ్యక్షతన నేడు కీలక భేటీ
ABN, Publish Date - Aug 18 , 2024 | 02:26 PM
జమ్మూ కశ్మీర్‌లో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జీ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తోపాటు ఆ పార్టీలోని కీలక నేతలు తరుణ్ చుగ్, రవీంద్ర రైనా తదితరులు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. అలాగే 80 శాతం మంది కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులను బరిలో దింపాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తుంది.
శ్రీనగర్, ఆగస్ట్ 18: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దీంతో రాష్ట్రంలో పాలన పగ్గాలు అందుకోనేందుకు వివిధ రాజకీయ పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఆ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేపట్టింది. అందులోభాగంగా ఆదివారం జమ్మూ కశ్మీర్‌లో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జీ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తోపాటు ఆ పార్టీలోని కీలక నేతలు తరుణ్ చుగ్, రవీంద్ర రైనా తదితరులు హాజరయ్యారు.
బీజేపీ ఒంటరి పోరు... 80 శాతం కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులు..
ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. అలాగే 80 శాతం మంది కొత్త ఎమ్మెల్యే అభ్యర్థులను బరిలో దింపాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. అందుకోసం ఈ రోజు భేటిలో చర్చ జరుపుతుంది. అలాగే జమ్మూ కశ్మీర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు చౌదరీ జుల్ఫీకర్ అలీ ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న జుల్పీఖర్ అలీ..
గుజ్జర్ వర్గానికి చెందిన జుల్పీకర్ అలీ.. గతంలో బుదల్ అసెంబ్లీ స్థానం నుంచి పీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో సైతం మంత్రిగా పని చేశారు. అయితే 2020లో ఆయన పీడీపీకి రాజీనామా చేసి.. జమ్మూ కశ్మీర్ అప్నీ పార్టీలో చేరారు. అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీలో అలీ చేరడం వల్ల ఆ పార్టీకి బలం చేకురుతుందని ఓ చర్చ సైతం సాగుతుంది.
పార్టీ గెలుపు కోసం ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ వరుస ర్యాలీలు..
మరోవైపు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన .. వచ్చే వారం నుంచి భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సన్నాహాకాలు జరుగుతున్నాయ. అందుకోసం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన... ఆ పార్టీ నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
మూడు విడతలుగా పోలింగ్..
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు - 2024, షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం.. అంటే ఆగస్ట్ 16న ప్రకటించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్ర అసెంబ్లీకి మూడు విడతలుగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆక్టోబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీంతో జమ్మూ కశ్మీర్ ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టిందనే విషయం ఆ రోజు తేలిపోనుంది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టనున్నాడనే విషయంపై సర్వత్ర తీవ్ర ఆసక్తి నెలకొంది.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 18 , 2024 | 02:30 PM