ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jammu and Kashmir: విధుల నుంచి మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులు తొలగింపు

ABN, Publish Date - Jul 24 , 2024 | 07:51 PM

జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

శ్రీనగర్, జులై 24: జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2) (సి) కింద ఈ తొలగింపు వెంటనే అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక వీరిపై ఎటువంటి విచారణ జరపకుండానే.. వారిని విధుల నుంచి తొలగించారు. దీంతో గత నాలుగేళ్లుగా ఉద్యోగులను తొలగించిన వారి సంఖ్య 64కు చేరింది.

Also Read: Bangladesh: సీఎం మమత వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్

Also Read: Telangana Assembly: ‘అయ్యేదుంటే సీఎం కావచ్చు’


అయితే తాజాగా విధుల నుంచి తొలగించిన ఉద్యోగుల్లో ఇద్దరు పోలీసులుండడం గమనార్హం. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు.. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని కారణంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఆ క్రమంలోనే సదరు ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తుంది. అయితే దేశ భద్రతకు ప్రభుత్వ ఉద్యోగులు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తితే.. వారిని తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశించే అధికారం రాష్ట్రపతి లేదా గవర్నర్‌కు ఉంటుంది.

Also Read: jammu and kashmir: రాష్ట్రంలో మెరుగు పడ్డ శాంతి భద్రతలు

Also Read: AP Floods: రైతుల కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన


ఈ నేపథ్యంలో నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం శ్రీనగర్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితి మరికొద్ది నెలల్లో సాధారణ స్థితికి చేరుకుంటుందన్నారు. ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలు ఊపందుకున్నాయి. ఆ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి.

Also Read: AP Assembly: అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

Also Read: శ్రీకాకుళం కొత్తఎస్పీ.. సోషల్ మీడియాలో ఎందుకంత వైరల్


మరోవైపు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి సారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. దీంతో ఈ ఎన్నికలపై అన్ని జాతీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 24 , 2024 | 07:52 PM

Advertising
Advertising
<