Bengaluru: జేపీ నడ్డా, అమిత్ మాలవీయకు సమన్లు
ABN, Publish Date - May 08 , 2024 | 05:28 PM
కర్ణాటక బీజేపీ విభాగం సోషల్‌మీడియోలో 'అభ్యంతకర పోస్ట్' పెట్టడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయకు బెంగళూరు పోలీసులు బుధవారంనాడు సమన్లు పంపారు. వారం రోజుల్లోగా తమ ముందు హాజరుకావాలని అందులో కోరారు.
బెంగళూరు: కర్ణాటక బీజేపీ విభాగం సోషల్‌మీడియోలో 'అభ్యంతకర పోస్ట్' (Objectionable post) పెట్టడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ (Amit Malaviya)కు బెంగళూరు పోలీసులు బుధవారంనాడు సమన్లు పంపారు. వారం రోజుల్లోగా తమ ముందు హాజరుకావాలని అందులో కోరారు. హైంగ్రౌడ్స్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ అధికారి ఈ సమన్లు పంపారు.
PM Modi: శరీరం రంగు చూపి ప్రజలను అవమానిస్తారా?.. శామ్ పిట్రోడాపై మోదీ నిప్పులు
ముస్లింల రిజర్వేషనకు కాంగ్రెస్ సానుకూలంగా ఉందంటూ బీజేపీ కర్ణాటక చీఫ్ బీవై విజయేంద్ర ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎస్‌సీలు, ఎస్టీలు, ఓబీసీలతో పోలిస్తే ముస్లింలకు పెద్దమొత్తంలో నిధులను రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామ్యయ్య కేటాయిస్తున్నారని ఆ వీడియోలో బీజేపీ ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది.
Read Latest National News and Telugu News
Updated Date - May 08 , 2024 | 05:28 PM