JP Nadda: రాజ్యసభ చైర్మన్‌పై ప్రెస్‌మీట్‌లో విమర్శలా?
ABN, Publish Date - Dec 13 , 2024 | 05:33 AM
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. ‘‘రాజ్యసభ చైర్మన్‌ను ప్రశ్నించడం ఆమోదయోగ్యం కాదు.
ఖర్గే తీరు సరికాదు: జేపీ నడ్డా
న్యూఢిల్లీ, డిసెంబరు 12: రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. ‘‘రాజ్యసభ చైర్మన్‌ను ప్రశ్నించడం ఆమోదయోగ్యం కాదు. చైర్మన్ ఆదేశాలను ప్రశ్నించడం లేదా విమర్శించడం తప్పు. ఒక వేళ అలా చేస్తే అది సభను, చైర్మన్‌ను ధిక్కరించినట్లే అవుతుంది’’ అని నడ్డా పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, సీనియర్ నాయకుడైన ఖర్గే మీడియా సమావేశంలో చైర్మన్‌పై విమర్శలు చేశారని, ఈ తప్పుడు చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సభలో తమకు అవకాశం ఇవ్వడం లేదని, చైర్మన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ ఖర్గే చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. చైర్మన్ తన చాంబర్‌కు రావాలని ఆదేశిస్తే ఖర్గే రాలేదని నడ్డా తెలిపారు. ఆయన ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనలేదన్నారు.
బీఏసీ సమావేశంలోనూ పాల్గొనలేదని, ప్రజాస్వా మ్యంపై ఖర్గేకు ఎంత గౌరవం ఉందన్నది ఈ చర్యతోనే అర్థమవుతోందని చెప్పారు. కాగా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పక్షపాతంతో వ్యవహ రిస్తున్నారని ఖర్గే గురువారం ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యుల భావప్రకటనా స్వేచ్ఛను ఆయన అణచివేస్తున్నారన్నారు. సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడం, హేళన చేయడం, నిరాధార ఆరోపణలు చేయడం, ప్రజాసమస్యలపై చర్చించాలని కోరితే తిరస్కరించడం చైర్మన్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే నడ్డా తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తామెవరికీ తల వంచమని, హక్కుల పరిరక్షణకు పోరాడతామని ఖర్గే చెప్పారు.
Updated Date - Dec 13 , 2024 | 05:33 AM