Puja Khedkar: న్యాయ విచారణను ఎదుర్కొంటా.. యూపీఎస్‌ఎసీ చర్యలపై పూజా కేడ్కర్
ABN, Publish Date - Jul 19 , 2024 | 08:34 PM
వరుస వివాదాలపై ఉక్కిరిబిక్కిరి అవుతున్న వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తాజాగా యూపీఎస్‌సీ కఠిన చర్యలకు ఉపక్రమించడంపై స్పందించారు. న్యాయవిచారణను ఎదుర్కొంటానని చెప్పారు.
న్యూఢిల్లీ: వరుస వివాదాలపై ఉక్కిరిబిక్కిరి అవుతున్న వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేడ్కర్ (Trainee IAS Puja Khedkar) తాజాగా యూపీఎస్‌సీ (UPSC) కఠిన చర్యలకు ఉపక్రమించడంపై శుక్రవారంనాడు స్పందించారు. న్యాయవిచారణను ఎదుర్కొంటానని చెప్పారు.
యూపీఎస్‌సీ పరీక్ష నిబంధనలను అతిక్రమించేలా నకిలీ పత్రాలతో పూజా ఖేడ్కర్ పరీక్షలను క్లియర్ చేసినట్టు గుర్తించామని యూపీఎస్‌సీ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. నకిలీ పత్రాలు సమర్పించిన మోసానికి పాల్పడటంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆమె యూపీఎస్‌సీ అభ్యర్థిత్వం రద్దుతో పాటు భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఆమెకు షోకాజ్ నోటీసులు పంపామని తెలిపింది. ఖేడ్కర్ యూపీఎస్‌సీ పరీక్షల నిబంధలను అతిక్రమిస్తూ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోగ్రాఫ్, సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, అడ్రస్‌కు సంబంధించిన ప్రత్రాలను మార్చడం వంటి మోసపూరిత చర్యలకు పాల్పడినట్టు గుర్తించామని ఆ ప్రకటన పేర్కొంది.
UPSC Vs Puja Khedkar: ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌పై యూపీఎస్‌సీ కేసు, నోటీసులు
కాగా, తనచుట్టూ ముదురుతున్న వివాదంపై పూజా ఖేడ్కర్ శుక్రవారంనాడు స్పందించారు. న్యాయవ్యవస్థ తన పని తాను తాను చేసుకుంటూ వెళ్తుందని, అడిగిన అన్నింటికి తాము సమధానమిస్తానని చెప్పారు. 2023 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి అయిన ఖేడ్కర్ పుణె కలెక్టర్ కార్యాలయంలో ట్రైనీగా విధులు నిర్వహిస్తూ వివాదంలో చిక్కారు. తనకు ప్రత్యేక అధికారులు, సదుపాయాల కోసం డిమాండ్ చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆమెను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ క్రమంలోనే యూపీఎస్‌సీకి గతంలో ఆమె సమర్పించిన డిజెబిలిటీ సర్టిఫెకెట్ ఫేక్ అనే ఆరోపణలు వచ్చాయి.
For More National News and Telugu News..
Updated Date - Jul 19 , 2024 | 08:34 PM