ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అత్యవసర విచారణ అంటూ పదేపదే రావద్దు

ABN, Publish Date - Oct 02 , 2024 | 04:13 AM

కేసుల అత్యవసర విచారణ విధానాన్ని దుర్వినియోగం చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంగళవారం న్యాయవాదులకు హితవు పలికారు.

అది నా ప్రతిష్ఠకు దెబ్బ: జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ, అక్టోబరు 1: కేసుల అత్యవసర విచారణ విధానాన్ని దుర్వినియోగం చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంగళవారం న్యాయవాదులకు హితవు పలికారు. ఒకే కేసును వివిధ తేదీల్లో పలు లాయర్ల ద్వారా ప్రస్తావింపజేసి, అత్యవసర విచారణ జరిపించాలని కోరుతుండడాన్ని తప్పుపట్టారు. ఇది ఆ విధానాన్ని పలచన చేయడమేనని, ఇలా చేస్తే తన వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటుందని అన్నారు. ‘‘ఒకే కేసును పలు సందర్భాల్లో వివిధ న్యాయవాదుల ద్వారా ప్రస్తావింపజేసే పద్ధతిని మానేయండి. నాకున్న కొద్దిపాటి విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకోను. ముగ్గురు న్యాయవాదులు వస్తారు... జడ్జి దృష్టిలో పడాలని చూస్తారు. జడ్జి చూశారంటే మీరు ఉత్తర్వులు పొందినట్టే. ఈ కోర్టులో ఇదే జరుగుతోంది. నేను ఆ పని చేయను. ఎందుకంటే అది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు మచ్చ’’ అని వ్యాఖ్యానించారు. మైనింగ్‌ లీజు మురిగిపోయిన కేసును అత్యవసర విచారణ జరపాలంటూ ఓ న్యాయవాది చేసిన వినతిపై స్పందిస్తూ ఈ సూచన చేశారు.

Updated Date - Oct 02 , 2024 | 04:13 AM