Madan B. Lokur: జస్టిస్ లోకుర్‌కు ఐరాస పదవి
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:37 AM
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్‌కు ఐక్యరాజ్యసమితి పదవి వరించింది.
ఐక్యరాజ్యసమితి, డిసెంబరు 21: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకుర్‌కు ఐక్యరాజ్యసమితి పదవి వరించింది. ఆయన ఐరాస అంతర్గత న్యాయ మండలి (ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్-ఐజేసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఐరాస న్యాయవ్యవస్థ స్వతంత్రత, వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనంతో పనిచేసేలా చూడడం ఈ కౌన్సిల్ లక్ష్యం. ఐరాస పరిధిలోని ట్రైబ్యునళ్ల జడ్జీలను ఎంపిక చేయడం కూడా దీని బాధ్యత. జస్టిస్ లోకుర్ ఈ పదవిలో నాలుగేళ్ల పాటు అంటే 2028 నవంబరు 12వ తేదీ వరకు కొనసాగనున్నారు.
Updated Date - Dec 22 , 2024 | 02:37 AM