Justice Ram Subramanian : మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్
ABN, Publish Date - Dec 24 , 2024 | 06:53 AM
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం
న్యూఢిల్లీ, డిసెంబరు 23: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. మానవ హక్కులను ఉల్లంఘించినట్టు ప్రభుత్వం, అధికారులపై ఫిర్యాదులు వస్తే వాటిపై విచారణ జరపడం ఈ కమిషన్ ప్రధాన బాధ్యత. ఇంతవరకు ఆ పదవిని నిర్వహించిన జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్ర జూన్ నెలలో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి విజయ భారతి సాయాని తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ నియామకంపై ఈ నెల మొదట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ బేటీకి ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు హాజరయ్యారు.
Updated Date - Dec 24 , 2024 | 06:53 AM