ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kangana Ranaut: బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందన

ABN, Publish Date - Jun 07 , 2024 | 02:36 PM

ఛండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ని కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన ఘటనలో బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందించింది. శుక్రవారం ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసి.. అనంతరం ఆ పోస్ట్‌ను ఆమె తొలగించింది. ఈ ఘటనపై మీరు వేడుక చేసుకొంటూ ఉండవచ్చు లేదా నిశ్శబ్దంగా ఉండవచ్చు.

Kangana Ranaut

న్యూఢిల్లీ, జూన్ 07: ఛండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ని కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన ఘటనలో బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందించింది. శుక్రవారం ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసి.. అనంతరం ఆ పోస్ట్‌ను ఆమె తొలగించింది. ఈ ఘటనపై మీరు వేడుక చేసుకొంటూ ఉండవచ్చు లేదా నిశ్శబ్దంగా ఉండవచ్చు. రేపు మీ దేశంలో లేదో ప్రపంచంలో మరో చోట.. మీరు వెళ్తున్నప్పుడు ఇజ్రాయోల్‌కు చెందిన వారు కానీ పాలస్తీనాకు చెందిన వారు కానీ.. మీపైనో... మీ పిల్లలపైనో దాడి చేస్తే నేను మౌనంగా ఉండను.. మీ హక్కుల కోసం పోరాడతాను.. అది మీరు చూస్తారని కంగనా రనౌత్ పేర్కొన్నారు.

గతంలో పంజాబ్ రైతులు.. ఢిల్లీ సరిహద్దుల వద్ద ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో వారి ఆందోళనపై కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్.. ఆమెపై దాడి చేసిందని ఓ చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు.. ఇజ్రాయోలు, పాలస్తీన యుద్దం నేపథ్యంలో బాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అందులోభాగంగానే కంగనా రనౌత్.. ఇన్‌స్టా‌ వేదికగా అలా స్పందించారనే ఓ చర్చ సైతం సాగుతుంది.


గురువారం న్యూఢిల్లీ వెళ్లేందుకు కంగనా రనౌత్.. ఛండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. విమాన ప్రయాణికుల తనిఖీల చేస్తున్న క్రమంలో ఆమె ఆ పక్కన కుర్చున్నారు. అంతలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్.. కంగనా రనౌత్ వద్దకు వచ్చి ఘర్షణకు దిగి.. ఆమె చెంపపై కొట్టింది. దీంతో విమాన సిబ్బంది కుల్వీందర్ కౌర్‌ను ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కంగనా న్యూఢిల్లీ చేరుకుని సీఐఎస్ఎఫ్ డీజీకి ఈ ఘటనను వివరించింది.

మరోవైపు కానిస్టేబుల్ కుల్వీందర్ సింగ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమెను స్థానిక సీఐఎస్ఎఫ్ కార్యాలయానికి తరలించి.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

For Latest News and National News click here

Updated Date - Jun 07 , 2024 | 03:26 PM

Advertising
Advertising