ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు అరుదైన దృశ్యం

ABN, Publish Date - Aug 26 , 2024 | 03:33 PM

శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథుర(Mathura)లో ఆయన జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని చూసేందుకు అనేక మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఆయన జన్మదిన వేడుకల కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Kanha darshan in Mathura

శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథుర(Mathura)లో ఆయన జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని చూసేందుకు అనేక మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మథుర నగరం రంగురంగుల దీపాలతో అలంకరించబడింది. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇంకా ఇక్కడికి చేరుకుంటున్నారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఆయన జన్మదిన వేడుకల కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా 20 గంటల పాటు కృష్ణ జన్మస్థాన్ ఆలయం తెరిచి ఉంటుందని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ తెలిపింది. సాయంత్రం 7 నుంచి 12 గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది. 12 గంటలకు హారతి అనంతరం కేక్ కట్ చేస్తారు. భక్తులకు పంజేరి ప్రసాదం, పంచామృతం పంపిణీ చేస్తారు.


అర్ధరాత్రి మొదలు

మథురలో జన్మాష్టమి పూజ ఆగస్టు 26న అర్ధరాత్రి 12:01 AM నుంచి 12:45 AM వరకు జరగుతుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఆలయాల్లో అలంకరణలు సహా ఇతర ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం పలు ఆలయాల్లో సత్సంగం ఉంటుంది. అభిషేకం, అలంకారం కూడా ఉంటుంది. రాత్రి 12 గంటలకు జన్మదినోత్సవం, కృష్ణ జన్మ హారతి ఇస్తారు. దుదధారి గోపాల్ ఆలయంలో 27న జన్మాష్టమి, 28న నందోత్సవం నిర్వహిస్తారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రతి ఇంట్లో కన్హ జన్మిస్తారని భక్తులు భావిస్తారు. దీంతో ఆయన దర్శనం కోసం భారతదేశం, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు మథురకు తరలి వస్తున్నారు.


ఈసారి భక్తులు..

భద్రత దృష్ట్యా ప్రతి సందులో పోలీసులు, పీఏసీ సిబ్బందిని మోహరించారు. నిఘా వర్గాల అంచనాల ప్రకారం ఈసారి 50 లక్షల మందికి పైగా భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవాన్ని వీక్షించనున్నారు. మథుర బృందావన్‌లోని ప్రధాన ఆలయాల్లో సోమవారం రాత్రి 12 గంటలకు కన్హయ్య జన్మించిన వెంటనే ఏనుగు గుర్రం పల్లకీలో వేడుకలు నిర్వహిస్తారు. ఆ క్రమంలో జై కన్హయ్యలాల్ నినాదాలతో మార్మోగనుంది. ఈ క్రమంలో శ్రీకృష్ణ జన్మస్థలం, ఠాకూర్ బాంకే బిహారీ ఆలయం, ద్వారకాధీష్ ఆలయం, ప్రేమ్, ఇస్కాన్ దేవాలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకోనున్నారు.


హెల్ప్‌లైన్ నంబర్‌

మరోవైపు మథురను సందర్శించిన భక్తులు ఏదైనా సమస్య ఉంటే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని నిర్వహకులు సూచించారు. హెల్ప్‌లైన్ నంబర్ 18601801508. పోలీస్, టూరిజం, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, రోడ్‌వేస్, రైల్వే ఉద్యోగులు 24 గంటల అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లో ఏ పర్యాటకులైనా మథురకు చేరుకోవడానికి, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లే సమయాల గురించి కూడా సమాచారాన్ని పొందవచ్చు.

అంతేకాదు స్థానిక మార్గాలు, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ కంట్రోల్ రూమ్ నుంచి పొందవచ్చు. మీరు ఏదైనా సమస్య గురించి కూడా ఫిర్యాదు చేయవచ్చు. వాటిని పోలీసులు వింటారు. మునిసిపల్ కార్పొరేషన్ మురికికి సంబంధించిన ఫిర్యాదులను కూడా స్వీకరిస్తారు.


ఇవి కూడా చదవండి:

J-K Election: అభ్యర్థుల జాబితాను ఉపసంహరించుకున్న బీజేపీ...కొత్త జాబితా విడుదల

Ladakh: లద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు.. కేంద్ర హోంమంత్రి ప్రకటన..


Read More National News and Latest Telugu News

Updated Date - Aug 26 , 2024 | 03:40 PM

Advertising
Advertising
<