ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttar Pradesh: కన్వర్ యాత్రికుల అగ్రహం.. 'పోలీస్' స్టికర్ వాహనం ధ్వంసం

ABN, Publish Date - Jul 29 , 2024 | 03:06 PM

ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ లో కన్వర్ యాత్రికులు 'పోలీస్' సిక్టర్, సైరెన్ ఉన్న ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. కన్వరీలకు రిజర్వ్ చేసిన చిన్న వీధిలోకి వాహనం రావడంతో వారు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. వాహనంపై విరుచుకుపడి ధ్వంసం చేశారు.

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh)లోని ఘజియాబాద్‌ (Ghaziabad)లో కన్వర్ యాత్రికులు (Kanwariyas) 'పోలీస్' సిక్టర్, సైరెన్ ఉన్న ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. కన్వరీలకు రిజర్వ్ చేసిన చిన్న వీధి (Lane)లోకి వాహనం రావడంతో వారు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. వాహనంపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. అయితే అది ప్రైవేటు వాహనమని, అధికారిక పోలీసు వాహనం కాదని ఘటన అనంతరం పోలీసులు వివరణ ఇచ్చారు. మధుబన్ బాపుధామ్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని ఢిల్లీ-మీరట్ రోడ్డుపై ఉన్న దుహాయ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


కన్వరియాలను శాంతింపజేసిన పోలీసులు

పోలీసు వర్గాల కథనం ప్రకారం, సోమవారం ఉదయం 10.15 గంటల సమయంలో దుహాయ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక వాహనం కన్వర్ యాత్రికుని ఢీకొంది. దీంతో అక్కడున్న కొందరు కన్విరియాలు తీవ్ర ఆగ్రహంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని శాంతింపజేసి వెనక్కి పంపారు.

UPSC aspirants’ death: ఈ ప్రమాదానికి ముందు దృశ్యాల వీడియో వైరల్


కాగా, అవినాష్ త్యాగి అనే వ్యక్తి బొలెరో వాహనాన్ని నడుపుతూ కన్వరియా లేన్‌లోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో తేలింది. డ్రైవర్‌ను, వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 03:06 PM

Advertising
Advertising
<