ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Karnataka: బెంగళూరు సౌత్‌గా రామనగర జిల్లా.. పేరు మార్పునకు మంత్రివర్గం ఆమోదం

ABN, Publish Date - Jul 26 , 2024 | 05:35 PM

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామనగర జిల్లా జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చాలనే ఆలోచనకు మంత్రివర్గం శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. రామనగర ప్రజల డిమాండ్లను పరిశీలించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

బెంగళూరు: కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామనగర జిల్లా (Ramanagara) జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లా (Bengaluru south district)గా మార్చాలనే ఆలోచనకు మంత్రివర్గం శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. రామనగర ప్రజల డిమాండ్లను పరిశీలించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.


మంత్రివర్గ నిర్ణయాన్ని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు తెలియజేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. 'బ్రాండ్ బెంగళూరు' ఆలోచనను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పేరు మార్పును త్వరలోనే రెవన్యూ శాఖ నోటిఫై చేస్తుందన్నారు. జిల్లా పేరు మారినప్పటికీ తాలూకాల్లో ఎలాంటి మార్పులు ఉండవని మంత్రి వివరణ ఇచ్చారు. రామనగర జిల్లాలో ప్రస్తుతం రామనగర, మగడి, కనకపుర, చన్నపట్న, హహోహల్లి తాలూకాలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం బెంగళూరు సౌత్ జిల్లాలో భాగంగా ఉంటాయి.

Agnipath Scheme: 'కార్గిల్ దివస్'లోనూ అబద్ధాలు మానరా? మోదీకి ఖర్గే కౌంటర్


పేరు మార్పు ప్రతిపాదన డీకేదే..

తొలుత రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చాలనే ప్రతిపాదనను గత ఏడాది అక్టోబర్‌లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేశారు. బెంగళూరు సిటీకి దగ్గరగా ఉండే రామనగర, మగడి, కనకపుర, చన్నపట్నం, హరో హల్లి తాలూకాలకు బెంగళూరు గ్లోబల్ రెప్యుటేషన్ తీసుకురావాలనే ఆలోచనలో తాము ఉన్నామని చెప్పారు. రామనగర సిటీని కొత్త జిల్లా హెడ్‌క్వార్టర్స్‌గా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. అయితే, ఇందువల్ల ఎలాంటి అభివృద్ధి ఉండదని, రామనగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు వచ్చేలా చేసే ఉద్దేశమే ఇందులో ఉందని జేడీఎస్, బీజేపీ అప్పట్లో విమర్శించాయి. రామనగర పేరును మారిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని జేడీఎస్ నేత కుమారస్వామి హెచ్చరించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 05:44 PM

Advertising
Advertising
<