ఎస్సీ కుల వర్గీకరణకు కర్ణాటక క్యాబినెట్ ఓకే
ABN, Publish Date - Oct 29 , 2024 | 03:47 AM
షెడ్యూల్డు కులాల వర్గీకరణకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా డేటా సేకరించేందుకు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో
బెంగళూరు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డు కులాల వర్గీకరణకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా డేటా సేకరించేందుకు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి సోమవారం మీడియాకు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలో చర్చలు సాగుతున్నాయని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిషన్ నుంచి నివేదిక అందాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. మూడు నెలల్లోగా సదరు కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని అన్నారు.
Updated Date - Oct 29 , 2024 | 03:47 AM