ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kasturi: కస్తూరికి కంటిమీద కునుకే లేదు.. జైలులో సాధారణ ఖైదీలతోనే

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:33 AM

వివాదాస్ప వ్యాఖ్యల కేసులో పుళల్‌ కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నటి కస్తూరి(Kasturi)కి తొలిరోజు కంటిపై కునుకే కరువైందని జైలు వర్గాలు తెలిపాయి. ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు(Egmore Metropolitan Court) 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆమెను ఆదివారం మధ్యాహ్నం పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

చెన్నై: వివాదాస్ప వ్యాఖ్యల కేసులో పుళల్‌ కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నటి కస్తూరి(Kasturi)కి తొలిరోజు కంటిపై కునుకే కరువైందని జైలు వర్గాలు తెలిపాయి. ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు(Egmore Metropolitan Court) 14 రోజుల రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆమెను ఆదివారం మధ్యాహ్నం పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కొత్త ఖైదీలందరినీ ఒకే హాలులో ఉంచి వారి వివరాలను జైలు అధికారులు తీసుకుంటారు. ఆ తర్వాత జైలులో ప్రముఖులకు ఏ1 గదులు కేటాయిస్తుంటారు.

ఈ వార్తను కూడా చదవండి: అమెరికా పోలీసుల అదుపులో అన్మోల్‌ బిష్ణోయ్‌


సినీ నటి కస్తూరి కి ఆ తరహా గది కేటాయించలేదు. అయితే, ఆమె కోర్టుకు విన్నవించుకుని ఏ1 గది పొందే అవకాశం ఉంది. అప్పటివరకు సాధారణ మహిళా ఖైదీలతోనే గడపాల్సి ఉంటుంది. ఆదివారం రాత్రి సాధారణ ఖైదీలతో గడిపిన కస్తూరిని, సోమవారం తక్కువమంది మహిళా ఖైదీలున్న గదికి మార్చారు. జైలులో దొమలు బెడద ఎక్కువగా ఉండటం, సాధారణ మహిళా ఖైదీలతో కలిసి వుండాల్సి రావడంతో ఆమె బాగా ఇబ్బంది పడినట్లు తెలిసింది.


రేపు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

నటి కస్తూరి బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆమె తరపు న్యాయవాది ప్రభాకర్‌ సోమవారం ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాది వెల్లడించారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 11:33 AM