ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Parliament: పార్లమెంటులో ప్రజా పద్దుల సంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్

ABN, Publish Date - Aug 16 , 2024 | 07:54 PM

పార్లమెంటులో ప్రజాపద్దుల సంఘాన్ని(Public Accounts Committee) ఏర్పాటు చేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) శుక్రవారం ప్రకటన జారీ చేశారు.

ఢిల్లీ: పార్లమెంటులో ప్రజాపద్దుల సంఘాన్ని(Public Accounts Committee) ఏర్పాటు చేస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) శుక్రవారం ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణు గోపాల్ నేతృత్వంలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ ఈ కమిటీ ఆడిట్ నిర్వహిస్తుంది. లోక్ సభ, రాజ్యసభ నుంచి 29 మంది సభ్యులు ఇందులో ఉంటారు. నలుగురు తెలుగు ఎంపీలకు సైతం కమిటీలో చోటు దక్కింది. లోక్‌సభ నుంచి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జనసేన ఎంపీ బాలశౌరి, రాజ్యసభ నుంచి బీజేపీ సభ్యుడు డా.లక్ష్మణ్‌లకు చోటు దక్కింది. 2025 ఏప్రిల్ 30 వరకు ఈ కమిటీకి గడువు ఉంటుంది.


పీఏసీ అంటే?

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) అనేది పార్లమెంటు.. ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేసే ఉద్దేశంతో ఎంపిక చేసిన సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఓ సభ్యుడు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భారత పార్లమెంటు మూడు ఆర్థిక స్టాండింగ్ కమిటీలలో ఒకటి. పార్లమెంటు సమక్షంలో వివిధ పనులకు మంజూరైన నిధులు సరైన పద్ధతిలో ఖర్చు చేశారా? లేదా? అని మానిటర్ చేయడం పీఏసీ పని. కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (CAG) నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ కమిటీ పరిశీలిస్తుంది. పీఏసీని 1921లో రూపొందించారు.

ఇందులో 29 మంది సభ్యులు ఉంటారు. కమిటీ ఛైర్‌పర్సన్‌ని లోక్ సభ స్పీకర్ నియమిస్తారు. ఇందులోని సభ్యుల పదవీ కాలం ఒక ఏడాది. 18వ లోక్‌సభలో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో పీఏసీకి నాయకత్వం వహించే అర్హత పొందింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి 2019 జులై నుంచి పీఏసీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. తాజాగా అదే పార్టీకి చెందిన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ని ఛైర్మన్‌గా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలిపారు.

Updated Date - Aug 16 , 2024 | 07:54 PM

Advertising
Advertising
<