ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిక్కుల్లో ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం!

ABN, Publish Date - Sep 11 , 2024 | 05:56 AM

కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆప్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ నేతలు ఇచ్చిన మెమొరాండంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర హోం శాఖకు సిఫారసు చేశారు.

  • సర్కారు రద్దుకు బీజేపీ విజ్ఞప్తి

  • కేంద్ర హోం శాఖకు సిఫారసు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఆప్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ నేతలు ఇచ్చిన మెమొరాండంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర హోం శాఖకు సిఫారసు చేశారు. ఢిల్లీ శాసనసభ ప్రతిపక్ష నేత విజేందర్‌ గుప్తా నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఆగస్టు 30న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును స్వయంగా కలిసింది. మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్నప్పటికీ కేజ్రీవాల్‌ తన సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంతో పాలన గాడితప్పి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని రాష్ట్రపతికి తెలియజేసింది. ప్రభుత్వం ఆరో ఫైనాన్స్‌ కమిషన్‌ ఏర్పాటు చేయలేకపోవడం, కాగ్‌ నివేదికపై స్పందించకపోవడాన్ని ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంటూ ఓ మెమొరాండంను అందజేసింది. తమ విజ్ఞప్తిపై స్పందించిన రాష్ట్రపతి.. విషయాన్ని కేంద్ర హోం శాఖకు సిఫారసు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజేందర్‌ గుప్తా సోమవారం ప్రకటించారు. ఈ వ్యవహారంలో బీజేపీ తీరుపై ఆప్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ దొడ్డిదారిలో ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తోందని ఆప్‌ నేత, రాష్ట్ర మంత్రి అతిషి మంగళవారం ధ్వజమెత్తారు.

Updated Date - Sep 11 , 2024 | 05:56 AM

Advertising
Advertising