ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections: కేరళలో ఖాతా తెరవనున్న బీజేపీ

ABN, Publish Date - Jun 01 , 2024 | 08:12 PM

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో బీజేపీ బోణి కొట్టే అవకాశాలున్నాయని ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ 1 నుంచి 3 స్థానాలను గెలుచుకోనుంది.

తిరువనంతపురం/భువనేశ్వర్, జూన్ 01: ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో బీజేపీ బోణి కొట్టే అవకాశాలున్నాయని ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ 1 నుంచి 3 స్థానాలను గెలుచుకోనుంది. ఇక యూడీఎఫ్ 13 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించనుంది. ఇక ఎల్‌డీఎఫ్ 3 నుంచి 5 స్థానాల్లో గెలవనుంది. ఏప్రిల్ 26వ తేదీన కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు రెండో దశలో పోలింగ్‌ జరిగింది.

Also Read: విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు

కేరళలో రాజకీయ పార్టీలు మూడు వర్గాలుగా ఉన్నాయి. యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రెంట్‌ సారథ్యంలో కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (ఎం) తోపాటు రివెల్యూషన్ సోషలిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఇక లెఫ్ట్ డెమెక్రటిక్ ఫ్రెంట్ నాయకత్వం కింద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం)లు ఉన్నాయి. మూడో రాజకీయ పార్టీగా బీజేపీ, భారత ధర్మ జనసేనతోపాటు కేరళ కాంగ్రెస్ (థామస్) ఉన్నాయి.

Also Read: ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం


మరోవైపు ఒడిశాలో బీజేపీ తన సత్తా చాటనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ సారి బీజేపీ 15 నుంచి 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకొనుంది. ఇక అధికార బీజేడీ మాత్రం 4 నుంచి 6 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం గత ఎన్నికల్లో వలే.. ఈ సారి కూడా ఒకే ఒక్క స్థానానికి పరిమితం కానుంది. అయితే ఒడిశాకు చెందిన నలుగురు ఎంపీలు ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారు.

Also Read: ముందు ఓటు.. తర్వాతే తల్లీ అంత్యక్రియలు

ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఆ రాష్ట్రంలోని మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు నాలుగు దశల్లో మే 13, మే 20, మే 25, జూన్ 1వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక గత ఎన్నికల్లో అంటే 2019లో బీజేడీ 12 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 8 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్కే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 113 స్థానాలను గెలచుకుంది. బీజేపీ 23, కాంగ్రెస్ పార్టీ 9, సీపీఐ (ఎం) 1, స్వతంత్ర్య అభ్యర్థి 1 స్థానాన్ని గెలుచుకున్నాయి.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Jun 01 , 2024 | 08:13 PM

Advertising
Advertising