ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kethi Reddy: పార్లమెంటు ఎన్నికల్లో స్టాలిన్‌కే నా మద్దతు

ABN, Publish Date - Jan 06 , 2024 | 12:55 PM

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీఎం స్టాలిన్‌(CM Stalin) నేతృత్వంలోని డీఎంకే కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethi Reddy Jagadeeswara Reddy) ప్రకటించారు.

- కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీఎం స్టాలిన్‌(CM Stalin) నేతృత్వంలోని డీఎంకే కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethi Reddy Jagadeeswara Reddy) ప్రకటించారు. త్వరలో చెన్నైలో నిర్వహించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి విజయోత్సవ సభకు మంత్రి ఉదయనిధిని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం కేతిరెడ్డి తన జన్మదినోత్సవాన్ని అపోలో ఆసుపత్రుల చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి గృహంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్‌ కట్‌ చేసి ప్రతాప్‌ సి రెడ్డి ఆశీస్సులు పొందారు. అనంతరం కేతిరెడ్డి జన్మదినం సందర్భంగా పలు ఆయాల్లో పూజలు, అన్నదానం, వృద్ధులకు పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు జరిగాయి. అమింజికరైలోని హోప్‌ పబ్లిక్‌ చారిటబుల్‌ ట్రస్టులోనూ కేతిరెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తెలుగు యువశక్తి కార్యవర్గ సభ్యులు డి.శివశంకర్‌రెడ్డి, బి.వర్ధన్‌, ప్రభాకర్‌, జి.బాబు, ఏవీ బాలాజీ, సుధాకర్‌, సీఏ హరీష్‌, పి.ఉదయకుమార్‌, పి.ఆడం, వసంత్‌ ప్రభ, టామ్స్‌ అధినేత గొల్లపల్లి ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ... తెలుగు భాష కోసం తను చేస్తున్న కృషి పట్ల సంతోషంగా ఉందన్నారు. భాషల అణచివేతను నేడు కొంతమంది రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, ప్రజలు దీనిని గ్రహిస్తున్నారన్నారు. ఇక్కడి వివిధ పార్టీల్లో తెలుగువారు మంత్రులుగా పని చేసినా, వారికి మాతృభాష పట్ల ప్రేమాభిమానాలు కరువయ్యాయన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 12:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising