ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections: అమేఠీలో నామినేషన్ వేసిన కిషోరీ లాల్ శర్మ

ABN, Publish Date - May 03 , 2024 | 03:54 PM

అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మ నామినేషన్ వేశారు. శుక్రవారం అమేఠీ రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే అమేఠీ, రాయ్ బరేలీ నుంచి రాహుల్, ప్రియాంక గాంధీలు బరిలో దిగుతారంటూ నిన్న మొన్నటి వరకు ఊహగానాలు ఊపందుకొన్నాయి.

Kishori Lal Sharma

లక్నో, మే 3: అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మ నామినేషన్ వేశారు. శుక్రవారం అమేఠీ రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే అమేఠీ, రాయ్ బరేలీ నుంచి రాహుల్, ప్రియాంక గాంధీలు బరిలో దిగుతారంటూ నిన్న మొన్నటి వరకు ఊహగానాలు ఊపందుకొన్నాయి.

LokSabha Elections: ఎన్నికలకు ముందే ఓటమి ఒప్పుకున్నారు..

ఇంకా చెప్పాలంటే.. గాంధీ కుటుంబానికి ఈ రెండు లోక్‌సభ స్థానాలు కంచుకోటలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల నుంచి వీరిద్దరు బరిలో దిగుతున్నారంటూ... అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఓ ప్రచారం అయితే ఓ రేంజ్‌లో వైరల్ అయింది.


ఆ క్రమంలో అమేఠీ, రాయ్‌బరేలీ ‘అభ్యర్థుల’ ఎంపికపై పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కసరత్తు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ బుధవారం ప్రకటించారు. ఆ యా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక 24 లేదా 30 గంటల్లో తేలుతుందని ఈ సంద్భంగా ఆయన స్పష్టం చేశారు.

దీంతో గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కిషోరీ లాల్ శర్మను అమేఠీ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. మరోవైపు రాయ్‌బరేలీ ఎంపీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారని ప్రకటించింది. ఇక కేరళలోని వాయనాడ్‌ ఎంపీ అభ్యర్థిగా రాహుల్ పోటీకి దిగారు.

Vote for Note: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా


ఆ లోక్‌సభ స్థానానికి ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. అయితే అమేఠీ ఎంపీ అభ్యర్థిగా గాంధీ కుటుంబంలోని వ్యక్తిని కాకుండా బయట వ్యక్తిని బరిలో దింపడంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అగ్రనేతలు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అమేఠీ నుంచి బరిలో దిగితే ఓటమి తప్పదనే విషయం గాంధీ కుటుంబానికి అర్థమైందని అంటున్నారు.

ABN Effect: ఆంధ్రజ్యోతి దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం

అందుకే వారు మరో స్థానాన్ని ఎంచుకున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో గాంధీ కుటుంబంలోని వారిని కాకుండా బయట వ్యక్తిని బరిలో దింపడంతో.. ఎన్నికల ముందే ఓటమి తథ్యమని గాంధీ కుటుంబం అర్థమైందని బీజేపీ నేతలు ఆరోపణలు సంధిస్తున్నారు.

ఇక అమేఠీ నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ బరిలో దిగారు. గత ఎన్నికల్లో అంటే.. 2019లో ఇదే స్థానం నుంచి బరిలో దిగిన రాహుల్ గాంధీ... స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Read Latest National News And Telugu News

Updated Date - May 03 , 2024 | 03:54 PM

Advertising
Advertising