Kolkata College student: సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోస్ట్.. విద్యార్థి అరెస్ట్
ABN, Publish Date - Aug 19 , 2024 | 03:00 PM
సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాలేజీ విద్యార్థి కీర్తి శర్మ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం కోల్‌కతా మహానగరంలో లేక్ టౌన్‌లోని నివాసంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
కోల్‌కతా, ఆగస్ట్19 : ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సర్వత్ర విమర్శలు అయితే వెల్లువెత్తాయి. అలాంటి వేళ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాలేజీ విద్యార్థి కీర్తి శర్మ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం కోల్‌కతా మహానగరంలో లేక్ టౌన్‌లోని నివాసంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: TGSRTC: బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ
మెడికల్ కాలేజీ ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి మూడు కథనాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి షేర్ చేశారని పోలీసులు తెలిపారు. వాటిలోని ఓ పోస్టులో హత్యాచార బాధితురాలి చిత్రాలతోపాటు ఆమె వివరాలను సైతం బహిర్గతం చేసేలా పోస్ట్ చేశారని వివరించారు. ఇది శిక్షార్హమైన నేరమని పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే మిగిలిన రెండు పోస్టుల్లో సీఎం మమతా బెనర్జీని విమర్శించమే కాకుండా.. ఆమెను నేరుగా బెదిరించేలా ఈ కథనాలు ఉన్నాయని పోలీసులు వివరించారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం
అలాగే ఈ కథనాలు పలు వర్గాలను హింసకు ప్రేరేపించే విధంగా ఉన్నాయన్నారు. దీంతో సమాజంలో అశాంతి ప్రబలే అవశాలున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతా పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు అందిందన్నారు. దీంతో ఆమెపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆమెను సెన్షన్స్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
ఈ సందర్భంగా కీర్తి శర్మను అరెస్ట్ చేయడంపై ఆమె తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఆమెను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఎవరినో సంతృప్తి పరచడం కోసం కీర్తి శర్మను ఇలా ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇంకోవైపు ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటనపై పుకార్లు ప్రచారం చేశారంటూ.. బీజేపీ మాజీ ఎంపీ లాకెట్ చటర్జీతోపాటు ఇద్దరు వైద్యులకు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు.
For Latest News and National News click here
Updated Date - Aug 19 , 2024 | 03:00 PM