ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata rape-murder protest: మెడికల్ కాలేజీ పరిసరాల్లో 7 రోజుల పాటు సెక్షన్ 163

ABN, Publish Date - Aug 18 , 2024 | 10:40 AM

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ నిరసనలు కొనసాగుతుండటంతో కోల్‌కతా పోలీసులు శాంతిభద్రతల దిశగా చర్యలకు దిగారు. మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చుట్టుపక్కల 7 రోజుల పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 చట్టం కింద సెక్షన్ 163 (గతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 144)ని విధించారు.

కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ నిరసనలు కొనసాగుతుండటంతో కోల్‌కతా పోలీసులు శాంతిభద్రతల దిశగా చర్యలకు దిగారు. మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చుట్టుపక్కల 7 రోజుల పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 చట్టం కింద సెక్షన్ 163 (గతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 144)ని విధించారు. ఆదివారం నుంచి ఈ సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ ఆదేశాలు జారీ చేశారు. సెక్షన్ 163 విధించిన ప్రాంతంలో ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలు జరపరాదని, చట్టవిరుద్ధంగా ఐదుగురు లేదా అంతకుమించి వ్యక్తులు ఒకేచోట గుమిగూడరాదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

CBI: ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్!


బీఎన్ఎస్ఎస్-2023లోని సెక్షన్ 163లోని సబ్ సెక్షన్‌ (1) కింద తనకు సంక్రమించిన అధికారాల ప్రకారం ఈ ఈదేశాలు జారీ చేస్తున్నట్టు గోయల్ తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి, 24వ తేదీ వరకు కానీ, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ కానీ ఏడు రోజుల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పారు. చట్టవిరుద్ధంగా ఐదుగురు, అంతకుమించి వ్యక్తులు ఒకేచోట గూమిగూడరాదని, లాఠీలు లేదా మారణాయుధాలు, ఇతర ప్రమాదకర వస్తువులు కలిగి ఉండరాదని, శాంతిభద్రతలకు ఎవరూ విఘాతం కలిగించరాదని అన్నారు. ఒక వర్గం ప్రజలు హింసాత్మక ప్రదర్శనలు, ర్యాలీలు, సమావేశాలు జరిపే అవకాశాలున్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది విధులను అడ్డుకోవడం జరగవచ్చనే సమాచారం మేరకు సెక్షన్ 163 విధించినట్టు చెప్పారు. గత బుధవారంనాడు కొంత మంది అల్లరిమూక నిరసనల ప్రాంతంలోనూ, ఆసుపత్రి క్యాంపస్‌లోనూ విధ్వంసానికి దిగడంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 10:41 AM

Advertising
Advertising
<