త్వరలో క్యాబినెట్ ముందుకు కోవింద్ కమిటీ నివేదిక
ABN , Publish Date - Jun 15 , 2024 | 05:32 AM
ఒకే దేశం - ఒకే ఎన్నిక ’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ముందుంచాలని న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్టు తెలిసింది. ఇది మోదీ ప్రభుత్వం 100 రోజుల ఎజెండాలో భాగంగా ఉన్నట్టు శుక్రవారం సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ, జూన్ 14: ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక ’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్ ముందుంచాలని న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్టు తెలిసింది. ఇది మోదీ ప్రభుత్వం 100 రోజుల ఎజెండాలో భాగంగా ఉన్నట్టు శుక్రవారం సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఒకే దేశం - ఒకే ఎన్నికపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ తన నివేదికను మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఇందులో మొదటి దశగా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని సూచించింది. కమిటీ సిఫారసుల అమలును పరిశీలించేందుకుగాను ఒక అమలు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మరోవైపు జమిలి ఎన్నికలపై లా కమిషన్ కూడా సొంతంగా వేరే నివేదికను రూపొందిస్తున్నట్టు సమాచారం.