ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కర్ణాటక ఆర్టీసీలో రూ.1,750కోట్ల బకాయిలు

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:29 AM

కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రూ.1750 కోట్ల బకాయిల విడుదల కోసం కేఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు.

డిసెంబరు 9న నిరసన ప్రదర్శనకు ఆర్టీసీ ఉద్యోగుల పిలుపు

(బెంగళూరు-ఆంధ్రజ్యోతి):

కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రూ.1750 కోట్ల బకాయిల విడుదల కోసం కేఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలను బెళగావిలోని సువర్ణసౌధలో నిర్వహించనున్న నేపథ్యంలో డిసెంబరు 9న చలో బెళగావికి కేఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు పిలుపునిచ్చారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే డిసెంబరు 31 నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు, ఉద్యోగుల పీఎఫ్‌ చందాలనూ కేఎస్‌ ఆర్టీసీ కొంతకాలంగా పీఎఫ్‌ ట్రస్టుకు చెల్లించడం లేదు. వడ్డీతో కలిపి ఆ బకాయిలు రూ.2,792.61 కోట్లకు చేరాయి. దీనిపై పీఎఫ్‌ ప్రాంతీయ కమిషనర్‌ కార్యాలయం తీవ్ర అభ్యంతరం తెలిపింది. కఠిన చర్యలు చేపడతామనీ హెచ్చరించింది. 6 గ్యారంటీలపై ప్రభుత్వంలోని నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ఇది ప్రాధాన్యం సంతరించుకొంది.

Updated Date - Nov 28 , 2024 | 04:29 AM