ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AIIMS: ఆసుపత్రి నుంచి ఎల్ కె అద్వానీ డిశార్జ్

ABN, Publish Date - Jun 27 , 2024 | 02:58 PM

తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్ కె అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని గురువారం ఎయిమ్స్ నుంచి వైద్యులు డిశార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందం క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి.. నివేదికలను పరిశీలించింది. అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సదరు వైద్య బృందం స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ, జూన్ 27: తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్ కె అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని గురువారం ఎయిమ్స్ నుంచి వైద్యులు డిశార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై మూత్ర (urology), గుండె (cardiology), వృద్ధాప్యం(geriatric)కు సంబంధించిన ప్రత్యేక వైద్య బృందం క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి.. నివేదికలను పరిశీలించింది. అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సదరు వైద్య బృందం స్పష్టం చేశారు. దీంతో ఆయన్ని డిశార్చ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 96 ఏళ్ల ఎల్ కె అద్వానీ బుధవారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని అల్ ఇండియా మెడికల్ సైన్సెన్స్ (ఎయిమ్స్)‌లో చేర్చిన సంగతి తెలిసిందే.


1927, నవంబర్ 8న కరాచీలో ఎల్ కె అద్వానీ జన్మించారు. 1942లో ఆర్ఎస్ఎస్‌లో స్వయంసేవక్‌గా చేరారు. ఇక 1986- 1990, 1993 - 1998 మధ్య ఎల్ కె అద్వానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 - 2005 మధ్య వాజపేయ్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా అద్వానీ కొనసాగారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. దీంతో భారత ప్రధానిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే 2 రోజుల ముందు అద్వానీ నివాసానికి నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ ఏడాదే ఎల్ కె అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించిన విషయం విధితమే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 27 , 2024 | 03:45 PM

Advertising
Advertising