Bihar: మీకోసం తలుపులు తెరిచే ఉన్నాయి.. నితీశ్‌కు లాలూ ప్రసాద్ ఆఫర్
ABN, Publish Date - Feb 16 , 2024 | 02:04 PM
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైదొలగి, ఎన్డీఏలో చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైదొలగి, ఎన్డీఏలో చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. సొంత గూటికి తిరిగి వెళ్లనని నితీశ్ కుమార్ చెప్పి ఉండవచ్చు. కానీ సొంతింటికి వచ్చేందుకు తలుపులు మూసుకోలేదని, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు సొంత గూటికి రావచ్చని చెప్పారు. నితీశ్ కుమార్‌కు పార్టీ మారే అలవాటు ఉందని ఆయన తప్పకుండా మిత్ర కూటమిలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడం గమనార్హం.
దేశ రాజధాని సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు పూర్తి మద్దతు ఉందని లాలూ ప్రసాద్ అన్నారు. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌ల ర్యాలీలో భారీగా జనం వస్తున్నారని, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తామే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. కాగా.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల యూటర్న్ తీసుకొని మాజీ మిత్రపక్షమైన ఎన్‌డీఏలో చేరిన విషయం తెలిసిందే. తాను శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో లాలూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
మరోవైపు.. బిహార్‌లో ఎన్డీఏ కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యం అని ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకుంటుందని పూర్తి నమ్మకంగా ఉన్నట్లు నితీశ్ కుమార్ తెలిపారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 16 , 2024 | 02:04 PM