ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LinkdIn: భారత్‌లో పని చేసేందుకు టాప్ 5 ది బెస్ట్ కంపెనీలేంటో తెలుసా

ABN, Publish Date - Apr 22 , 2024 | 02:02 PM

భారత్‌లో ఉన్న అనేక కంపెనీలను వెనక్కి నెట్టి లింక్డిన్ తాజా ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది టీసీఎస్(TCS). కంపెనీ ఉద్యోగుల పనితీరు, వృత్తిపర వృద్ధి, ఉద్యోగుల ప్రమోషన్లను పరిగణలోకి తీసుకుని లింక్డిన్ డేటా రూపొందించింది. ఇందులో లిస్ట్ అయిన టాప్ 5 కంపెనీలేంటంటే..

ఢిల్లీ: భారత్‌లో ఉన్న అనేక కంపెనీలను వెనక్కి నెట్టి లింక్డిన్ తాజా ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది టీసీఎస్(TCS). కంపెనీ ఉద్యోగుల పనితీరు, వృత్తిపర వృద్ధి, ఉద్యోగుల ప్రమోషన్లను పరిగణలోకి తీసుకుని లింక్డిన్ డేటా రూపొందించింది. ఇందులో లిస్ట్ అయిన టాప్ 5 కంపెనీలేంటంటే..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (IT సేవలు, కన్సల్టెన్సీ)

లింక్డ్‌ఇన్ టాప్ కంపెనీల జాబితాలో TCS అగ్రస్థానంలో నిలిచింది. గత సంవత్సరం కూడా టీసీఎస్‌ టాప్ పొజీషన్‌లో ఉండటం విశేషం. టీసీఎస్‌ని 1968లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ఈ ఏడాది టీసీఎస్ అనేక మందిని రిక్రూట్ చేసుకునేందుకు సిద్ధమైంది.

యాక్సెంచర్(ఐటీ సేవలు, కన్సల్టింగ్)

యాక్సెంచర్ ఇండియా అనేది యాక్సెంచర్ అనుబంధ సంస్థ. ఇది స్ట్రాటజీ, కన్సల్టింగ్, డిజిటల్, టెక్నాలజీ కార్యకలాపాలలో విస్తృత శ్రేణి సేవలను అందించే ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ. దీన్ని 1987లో స్థాపించారు. ప్రస్తుతం దేశంలోని అతి పెద్ద, అత్యంత ప్రభావవంతమైన సాంకేతికత, కన్సల్టింగ్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది.


Bulgur: దొడ్డు రవ్వ ఇంత మేలు చేస్తుందా.. తెలిస్తే వదిలిపెట్టరు

కాగ్నిజెంట్(ఐటీ సేవలు, కన్సల్టింగ్)

కాగ్నిజెంట్ ఇండియా భారతీయ ఐటీ(IT) పరిశ్రమలో ఒక ప్రముఖ సంస్థ. ఇది గ్లోబల్ డెలివరీ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. 1994లో భువనేశ్వర్‌లో దీన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 5,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది.

Macquarie గ్రూప్..

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, అసెట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్‌లో ఈ కంపెనీ ప్రత్యేక స్థానంలో నిలిచింది. భారత్‌లోని టాప్ 5 కంపెనీల్లో వరుసగా రెండో ఏడాది కూడా ఈ కంపెనీ చోటు దక్కించుకుంది.

మోర్గాన్ స్టాన్లీ(ఆర్థిక సేవలు, బ్యాంకింగ్)

ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారతదేశంలో బలమైన ఉనికిని కలిగి ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పాటునిస్తోంది. అంతర్జాతీయ క్లయింట్‌ల విలీనాలు, సముపార్జనలు, మూలధన సేకరణ, పునర్నిర్మాణం, వ్యూహాత్మక లావాదేవీలపై సలహాలు అందిస్తుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2024 | 02:02 PM

Advertising
Advertising