ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha election 2024: ఎల్లుండి తొలి దశ పోలింగ్: నేటితో ప్రచారానికి తెర

ABN, Publish Date - Apr 17 , 2024 | 01:17 PM

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం అంటే.. ఏప్రిల్ 19వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. ఆ క్రమంలో ఈ రోజు.. ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తొలుత అసోంలోని నల్బరీలో.. అనంతరం త్రిపుర రాజధాని అగర్తలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

PM Modi, Rahul Gandhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: లోక్‌సభ ఎన్నికల తొలి దశ ( (Lok Sabha election 2024, First Phase)పోలింగ్ శుక్రవారం అంటే.. ఏప్రిల్ 19వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. ఆ క్రమంలో ఈ రోజు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రాల్లో (Northeast States) రెండు ర్యాలీల్లో పాల్గొంటున్నారు.

తొలుత అసోంలోని నల్బరీ (Assam's Nalbari)లో.. అనంతరం త్రిపుర రాజధాని అగర్తలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అందులోభాగంగా తొలుత మాండ్య, కోలార్ జిల్లాలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.

Elections 2024: అవినీతికి ఛాంపియన్ ప్రధాని మోదీ.. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో రాహుల్ ఫైర్..


మరోవైపు రాహుల్ గాంధీ (Rahul Gandhi), సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. మంగళవారం సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై విమర్శలు సంధించారు. ఆ క్రమంలో ఇటీవల ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూతోపాటు ఎలక్టోరల్ బాండ్లపై వారు విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ సైతం ఉత్తరప్రదేశ్‌లోని షెహరాన్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనున్నారు.

Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. వీక్షించేందుకు తరలివస్తున్న భక్తులు

మంగళవారం ఆమె త్రిపుర రాజధాని అగర్తలలో నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితీన్ గడ్కరీ.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నాగపూర్‌లో విర్చువల్‌గా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కేరళలో పర్యటించనున్నారు.


Ayodhya: అయోధ్య రాముడికి అపూర్వ ఘట్టం.. ఆ వేడుకనూ మీరూ చూసేయండి..

కన్నూరు, కాసర్‌గోడ్, వడక్కార నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీన తొలి దశ పోలింగ్ జరగనుంది. దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్దం చేసింది.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 17 , 2024 | 01:41 PM

Advertising
Advertising