ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Polls: రూ.25 వేల కాయిన్లతో కలెక్టరేట్‌కు.. షాక్‌కి గురైన సిబ్బంది.. ఎందుకంటే

ABN, Publish Date - Mar 21 , 2024 | 03:27 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌కి చెందిన వినయ్ చక్రవర్తి లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం నామినేషన్ ఫారమ్‌ని పొందేందుకు కలెక్టరేట్‌కి వెళ్లారు. రూ.25 వేలను కాయిన్స్ రూపంలో డిపాజిట్ చేశాడు. ఆయన పనికి కలెక్టరేట్ సిబ్బంది షాక్‌కి గురయ్యారు.

భోపాల్: లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నామినేషన్ ఫారమ్‌ని పొందేందుకు కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఓ చోట నామినేషన్ ఫారమ్ కోసం అభ్యర్థి చేసిన పనికి అధికారులు నివ్వెరపోయారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌కి చెందిన వినయ్ చక్రవర్తి లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం నామినేషన్ ఫారమ్‌ని పొందేందుకు కలెక్టరేట్‌కి వెళ్లారు.

రూ.25 వేలను కాయిన్స్ రూపంలో డిపాజిట్ చేశాడు. ఆయన పనికి కలెక్టరేట్ సిబ్బంది షాక్‌కి గురయ్యారు. చిల్లరను లెక్కపెట్టలేక నానా అవస్థలు పడ్డారు. రూ.10, రూ.5, రూ.2 కాయిన్లను డిపాజిట్ చేసినట్లు వినయ్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో డిజిటల్, ఆన్ లైన్ చెల్లింపులకు అవకాశం లేకపోవడంతో తన వద్ద ఉన్న నాణేలను అక్కడ సమర్పించానని వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. జబల్‌పూర్ జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా.. సదరు అభ్యర్థి నాణేలు చెల్లించిన విషయాన్ని ధ్రువీకరించారు. తరువాత ఆయనకి రసీదు జారీ చేసినట్లు చెప్పారు.


తొలి దశ నామినేషన్లు ఎప్పుడంటే..

ఏప్రిల్ 19న జరగనున్న లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సంబంధించి 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాల నామినేషన్ ప్రక్రియ బుధవారం నోటిఫికేషన్ జారీతో ప్రారంభమైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ మార్చి 27. అయితే పండుగ కారణంగా లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు మార్చి 28ని చివరి తేదీగా నిర్ణయించారు. మధ్యప్రదేశ్‌లో ఏప్రిల్ 19 నుంచి నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించిన బీజేపీ 29 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఒకే ఒక్క నియోజకవర్గమైన చింద్వారా సీటును ఎలాగైనా గెలుచుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 03:28 PM

Advertising
Advertising