Lok Sabha elections: ఎల్లుండే రెండో దశ పోలింగ్
ABN, Publish Date - Apr 24 , 2024 | 02:37 PM
లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం అంటే.. ఏప్రిల్ 26న జరగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగియనుంది. మరోవైపు.. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ (Lok Sabha elections 2024, phase 2) శుక్రవారం అంటే.. ఏప్రిల్ 26న జరగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగియనుంది.
Loksabha polls: హాట్‌సీట్‌గా ఖమ్మం పార్లమెంట్ స్థానం.. పోటాపోటీగా ఆశావాహుల నామినేషన్లు
మరోవైపు.. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శుక్రవారం ఉ 7.00 గంటల నుంచి సా 5.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఆయా ప్రాంతాల్లోని ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలిచారు.
Former Minister: ఎవరూ అడ్డుకోలేరు.. నేను మళ్లీ బీజేపీలో చేరుతా..
ఇక ఈ దశ పోలింగ్‌లో ప్రముఖులు భూపేష్ భగల్ (రాజనందగావ్),డీకే సురేష్ (బెంగళూరు గ్రామీణం), శోభ కరంద్లాజే (బెంగళూరు ఉత్తరం), తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణం), హెచ్‌డీ కుమార్ స్వామి(మాండ్యా), రాహుల్ గాంధీ (వయనాడ్), అనిల్ ఆంటోని (పతనతిట్ట), శశిథరూర్, రాజీవ్ చంద్రశేఖర్ (తిరువనంతపురం), రాజేంద్రసింగ్ షెకావత్ (జోధ్‌పూర్), వైభవ్ గెహ్లత్(జలోర్), హేమ మాలిని (మధుర), అరుణ్ గోవిల్ (మీరట్) బరిలో నిలిచారు.
PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’
ఇప్పటికే ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరిగింది. దేశ్యవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. లోక్‌సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. ఏడో దశ జూన్ 1 తేదీతో ముగియనుంది. దీంతో ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుంది.
Read National News and Telugu News
Updated Date - Apr 24 , 2024 | 02:37 PM