ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: వీల్‌చైర్ లేక.. ఎయిర్‌పోర్టులో నడక.. 80 ఏళ్లు పైబడ్డ వృద్ధుడి దుర్మరణం

ABN, Publish Date - Feb 16 , 2024 | 08:14 PM

ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ రావడం ఆలస్యం కావడంతో కాలినడకనే బయటకొచ్చేందుకు ప్రయత్నించిన ఓ 80 ఏళ్లు వృద్ధుడు దుర్మరణం చెందారు.

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ రావడం ఆలస్యం కావడంతో కాలినడకనే బయటకొచ్చేందుకు ప్రయత్నించిన ఓ 80 ఏళ్లు వృద్ధుడు దుర్మరణం చెందారు. ఫిబ్రవరి 12న ముంబై ఎయిర్‌పోర్టులో (Mumbai Airport) ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆ ప్యాసెంజర్ ఎయిర్‌ ఇండియా విమానంలో న్యూయార్క్ (Newyork) నుంచి ముంబైకి (Mumbai) వచ్చారు. తన భార్యతో పాటూ వచ్చిన ఆయన వీల్‌చైర్ కావాలని సిబ్బందిని కోరారు.

Viral: ఈ ఏనుగుది ఎంతటి జాలి గుండె? సింహం పిల్లల్ని చంపే గోల్డెన్ ఛాన్స్ వచ్చినా కూడా..


అయితే, వీల్‌చైర్‌లు వచ్చేందుకు కాస్తంత టైం పడుతుందని వారు చెప్పడంతో ఆయన నడస్తూ బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు (Long wait for wheelchair). ఈ క్రమంలో కొంత దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. ఎయిర్ పోర్టు డాక్టర్ సలహా మేరకు సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్యాసెంజర్ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు (Passenger chose to walk and collasped).

ViralVideo: ఎవరు బ్రో నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు.. నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో ఇది!


ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా (Air India) ప్యాసెంజర్ వయసు 80కి పైబడే ఉంటుందని ధ్రువీకరించింది. ఘటన జరిగిన రోజు వీల్‌చైర్‌లకు డిమాండ్ అధికంగా ఉండటంతో సిబ్బంది ఆయనను కొంత సేపు వేచి చూడాలని సూచించినట్టు తెలిపింది. ఈలోపు ప్యాసెంజర్ నడిచి వెళ్లేందుకు మొగ్గు చూపారని ఇంతలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చింది. కాగా, వీల్‌చైర్‌కు సంబంధించి తాము ఓ విధివిధానాలను కూడా రూపొందించామని ఎయిర్‌లైన్స్ సంస్థ పేర్కొంది. ముందుగానే చక్రాలకుర్చీ బుక్ చేసుకున్న ప్యాసెంజర్లందరికీ వాటిని అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 16 , 2024 | 08:22 PM

Advertising
Advertising