LokSabha Elections: తెలంగాణలో ఓవైసీ.. అసోంలో అజ్మల్: ప్రియాంక గాంధీ
ABN, Publish Date - May 01 , 2024 | 06:04 PM
ఆసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ శర్మ (Himanta Biswa Sarma)అత్యంత అవినీతిపరుడైన నాయకుడని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priaynka Gandhi) అభివర్ణించారు. ఆయన పాలనలో మాఫియా రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.
సిల్చేరు, మే 1: ఆసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ శర్మ (Himanta Biswa Sarma)అత్యంత అవినీతిపరుడైన నాయకుడని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priaynka Gandhi) అభివర్ణించారు. ఆయన పాలనలో మాఫియా రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం (Dhubri Loksabha constituency) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రకీబుల్ హుసేన్‌కి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ఈ హిమంత్ బిశ్వాస్ ప్రభుత్వం క్రిమిన్సల్‌ను రక్షిస్తుందని మండిపడ్డారు.
Lok Sabha Elections: నామినేషన్ వేసిన మేనక గాంధీ.. ఆ రెండు స్థానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ ఈశాన్య రాష్ట్రంలో మాఫియా రాజ్యం ఇంకా మనుగడలోనే ఉందన్నారు. ఈ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రెంట్ అధినేత బహయుద్దీన్ అజ్మల్.. మూడు సార్లు ఎంపీగా గెలుపొందారని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో లాండ్ మాఫియా, సుపారీ మాఫియా, శాండ్ మాఫియా, కోల్ మాఫియాలన్నీ బహిరంగంగానే జరుగుతున్నాయని వివరించారు. ఇవేకాకుండా రాష్ట్రంలో చాలా స్కామ్‌లు జరిగాయిన్నారు. అందులో పీపీఈ కిట్, ప్లైఓవర్, ఆవుల అక్రమ రవాణ తదితర స్కామ్‌లన్నీ ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు.
TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు
బీజేపీ పాలిత రాష్ట్రం అసోంలో ఇన్నీ దారుణాలు జరుగుతున్నా.. కేంద్రంలోని నేతలు మాత్రం ఈ ప్రభుత్వంపై పల్లెత్తి మాట మాట్లాడరని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. అదేమిటో ఇతర పార్టీల్లో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు సైతం.. బీజేపీలోకి వెళ్లగానే శుద్దపూసలుగా మారిపోతారంటూ.. సీఎం హిమాంత్ బిశ్వాస్ శర్మ వ్యవహారాన్ని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేశారు.
Salman Khan: నివాసం వద్ద కాల్పులు: నిందితుడు ఆత్మహత్య
కాంగ్రెస్ పార్టీలో హిమంత్ బిశ్వాస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. కానీ ఆయన బీజేపీలో చేరగానే అవన్ని మాయమైపోయాయని చెప్పారు. ఇక కర్ణాటకలో హాసన్ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ.. దేశం విడిచి వెళ్లడంతో ప్రధాని మోదీ సహకరించారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అందుకు ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 19 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని, అలాగే మణిపూర్‌లో చోటు చేసుకున్న ఘటనలను ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ సోదాహరణగా వివరించారు.
అయితే కేంద్రంలో 55 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని.. ఆ సమయంలో ఏ మహిళ బంగారు మంగళసూత్రాన్ని తెంపలేదని గుర్తు చేశారు. అంతేకాదు.. ఆ కాలంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఇస్రో, ఎయిమ్స్ తరహా ప్రభుత్వ సంస్థలు ఎన్నింటినో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ మోదీ 10 ఏళ్ల పాలనలో ఇటువంటి సంస్థలను ఏమైనా నెలకొల్పిందా? అంటూ ప్రజలను ఆమె సూటిగా ప్రశ్నించారు.
LokSabha Elections: కొన్ని గంటల్లో అమేథీ, రాయబరేలి అభ్యర్థుల ఎంపిక
తెలంగాణ రాష్ట్రంలో అసదుద్దీన్ ఓవైసీ ఎలా వ్యవహరిస్తున్నారో.. అసోంలో అజ్మల్ వ్యవహరిస్తున్నారన్నారు. వీరిద్దరు బీజేపీకి ఏజెంట్లని ప్రియాంక అభివర్ణించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే.. అసోం టీ తోటల్లో పని చేస్తున్న కార్మికులకు చెల్లిస్తున్న నగదు రూ. 400కి పెంచుతామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీగా ఉన్న 3 మిలియన్ల ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తామని ప్రియాంక గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు.
Read Latest National News And Telugu News
Updated Date - May 01 , 2024 | 06:05 PM