Maharashtra: అహ్మద్ నగర్ పేరు మార్పు..ఇక నుంచి అహల్యానగర్
ABN, Publish Date - Mar 13 , 2024 | 05:07 PM
వలస పాలకుల నాటి పాతపేర్ల స్థానే కొత్త పేర్లను మార్చుకుంటూ వెళ్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాంతానికి పేరు మార్చింది. అహ్మద్‌నగర్ పేరును అహల్యా నగర్‌గా మార్చాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మంత్రివర్గం బుధవారంనాడు ఆమోదం తెలిపింది.
ముంబై: వలస పాలకుల నాటి పాతపేర్ల స్థానే కొత్త పేర్లను మార్చుకుంటూ వెళ్తున్న మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం మరో ప్రాంతానికి పేరు మార్చింది. అహ్మద్‌నగర్ (Ahmednagar) పేరును అహల్యా నగర్ (Ahilya Nagar)గా మార్చాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సారథ్యంలోని మంత్రివర్గం బుధవారంనాడు ఆమోదం తెలిపింది. బ్రిటిషర్ల కాలం నాటి 8 ముంబై రైల్వే స్టేషన్ల పేర్లు మార్చాలని కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ఉత్తాన్ (Bhayander), విరార్ (Palghar) మధ్య సీ-లింగ్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
శ్రీనగర్‌లో 2.5 ఎకరాల స్థలం కొనుగోలుకు సై..
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మహారాష్ట్ర భవన్ నిర్మాణం కోసం 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలనే ప్రతిపాదన మహారాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మహారాష్ట్ర అసెంబ్లీ గత బడ్జెట్ సమావేశాల్లో ఒక ప్రతిపాదన కూడా చేశారు.
Updated Date - Mar 13 , 2024 | 05:07 PM