40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Milind deora: శివసేన వర్గంలోకి మిలింద్ దేవరా..55 ఏళ్ల బంధానికి గుడ్ బై!

ABN, Publish Date - Jan 14 , 2024 | 04:19 PM

మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరారు.

Milind deora: శివసేన వర్గంలోకి మిలింద్ దేవరా..55 ఏళ్ల బంధానికి గుడ్ బై!

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మహారాష్ట్ర(maharashtra)లో కీలక కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా(milind deora) ఆదివారం (జనవరి 14) తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుత మహారాష్ట్ర సీఎం షిండేను కలిసి శివసేన(shiv sena party)పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో సీఎం ఏక్‌నాథ్ షిండే పార్టీ జెండాను అందజేసి శివసేన సభ్యత్వం అందించారు. దీంతోపాటు ముంబయికి చెందిన పలువురు కూడా శివసేనలో జాయిన్ అయ్యారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మణిపూర్ నుంచి 'భారత్ జోడో న్యాయ యాత్ర' ప్రారంభించబోతున్న రోజునే దేవరా పార్టీకి రాజీనామా చేశారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bharat Jodo Nyay Yatra: మణిపూర్ చేరుకున్న రాహుల్ టీమ్..

47 ఏళ్ల మిలింద్ దేవరా ఆదివారం (జనవరి 14) తన కుటుంబానికి కాంగ్రెస్‌(congress)తో 55 ఏళ్ల బంధాన్ని ముగిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఈ రోజు నా రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. నేను భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధానికి ముగింపు పలికాను. తనకు గత అనేక సంవత్సరాలుగా తిరుగులేని మద్దతు ఇచ్చిన నాయకులు, సహచరులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

అయితే దక్షిణ ముంబై పార్లమెంటరీ నియోజకవర్గం సీట్ల పంపకానికి సంబంధించి శివసేన (యుబిటి) ఇటివల దావా వేసింది. ఈ క్రమంలో నిర్ణయించిన ఫార్ములా తర్వాత మాజీ కేంద్ర మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014కి ముందు ఈ సీటుకు మిలింద్ దేవరా ప్రాతినిధ్యం వహించారు. ఈ సీటుపై శివసేన (యుబిటి) వాదనపై దేవరా గతంలో తన అసంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం.

Updated Date - Jan 14 , 2024 | 04:40 PM

Advertising
Advertising