ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National: అప్పు ఇవ్వడమే ప్రాణం తీసిందా.. బీహార్ హత్య కేసులో సంచలన ట్విస్ట్‌లు..

ABN, Publish Date - Jul 18 , 2024 | 07:28 AM

బీహార్‌లో వీఐపీ (Vikassheel Insaan Party) అధినేత ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్య కేసును పోలీసులు చేధించారు. జితన్ సాహ్నిలోని ఘనశ్యాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుపాల్ గ్రామానికి చెందిన కాజిమ్ అన్సారీ ఈ హత్య చేసినట్లు నిర్దారణకు వచ్చారు.

Kazim Ansari

బీహార్‌లో వీఐపీ (Vikassheel Insaan Party) అధినేత ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్య కేసును పోలీసులు చేధించారు. జితన్ సాహ్నిలోని ఘనశ్యాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుపాల్ గ్రామానికి చెందిన కాజిమ్ అన్సారీ ఈ హత్య చేసినట్లు నిర్దారణకు వచ్చారు. సుపాల్ గ్రామంలో కాజిమ్ అన్సారీతో పాటు నలుగురు అనుమానితులను పోలీసులు పట్టుకుని విచారించారు. తాను హత్య చేసినట్లు కాజీమ్ అన్సారీ అంగీకరించారని పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే డబ్బు వ్యవహరమే హత్యకు దారితీసినట్లు తేలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కాజీం అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి వస్త్రాల దుకాణం ఉన్నప్పటికీ.. సరైన రాబడి లేకపోవడంతో కొంతకాలంగా దుకాణాన్ని మూసివేశారు. దీంతో చుట్టుపక్కల వాళ్ల దగ్గర అప్పులు చేయడం మొదలుపెట్టాడు. కాజీమ్ అన్సారీ తన భూమిని 4 శాతం నెలవారీ వడ్డీకి తనఖా పెట్టి జీతన్ సాహ్ని నుంచి రూ. 1.5 లక్షల రుణం తీసుకున్నాడు. 2022లో లక్ష, 2023లో 50 వేల రూపాయలు తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించలేకపోయాడు. హత్యకు మూడు రోజుల ముందు, కాజీమ్ అతని స్నేహితులలో ఒకరిని తీసుకుని జితన్ సాహ్ని వద్దకు వెళ్లి.. వడ్డీ మొత్తాన్ని తగ్గించాలని, వడ్డీ లేకుండా రుణం చెల్లిస్తానాని.. తనఖా పెట్టిన భూమి పత్రాలను తిరిగి ఇవ్వాలని అడిగారు. మాట్లాడుకుంటున్న సమయంలో కాజిమ్ ప్రతిపాదనకు జితన్ సాహ్ని అంగీకరించకపోవడంతో నిందితుడు వాగ్వాదానికి దిగారు.

Bhubaneswar: రత్నభాండాగారంలో పురాతన విగ్రహాలు


భూమి ప్రతాల కోసం..

జితన్ సాహ్ని తన భూమి పత్రాలను తిరిగి ఇవ్వరని తెలుసుకున్న కాజిమ్..ఎలాగైనా తన ల్యాండ్ డాక్యుమెంట్లను తీసుకోవాలని.. అవసరమైతే అపహరించాలని తన సహచరులు కొందరితో కలిసి ప్లాన్ చేశాడు. జితన్ సాహ్ని ఇంట్లో పనిచేసే వ్యక్తులు దాదాపు రాత్రి 11 గంటలకల్లా వెళ్లిపోతారని తెలుసుకుని.. ఆ తర్వాత సాహ్ని ఇంట్లోకి వెనుకవైపు నుంచి ప్రవేశించారు.

Pune: వైకల్య సర్టిఫికెట్‌ కోసం నకిలీ రేషన్‌ కార్డు


మొదట బెదిరించి..

కాజిమ్ తన సహచరులతో కలిసి సాహ్ని ఇంట్లోకి వెళ్లగా.. జితన్ సాహ్ని నిద్రపోతున్నారు. అయితే ఆయనను నిద్రలేపి తొలుత బెదిరించారు. తన ల్యాండ్ డాక్యుమెంట్లు ఇవ్వాలని అడిగాడు. సాహ్ని ఒప్పుకోకపోవడంతో కాజిమ్ కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో నిందితుడితో పాటు వచ్చిన కాజిమ్ స్నేహితులు.. జితన్ సాహ్ని చేతులు, కాళ్లను పట్టుకున్నారు. జితన్ సాహ్నిని హత్య చేసిన తర్వాత వీరంతా పత్రాలు ఉన్న అల్మారా తాళం చెవి ఎక్కడుందో వెతకడం ప్రారంభించారు. కీ దొరకకపోవడంతో అల్మారాను ఏదైనా చెరువులో పడేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో చెక్క అల్మారాను ఇంటి వెనుక ఉన్న చిన్న చెరువులో పడేసి అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. హత్య తర్వాత పోలీసులు తమ విచారణలో ఈ అల్మారాను తెరిచి చూడగా.. అందులో భూమికి సంబంధించిన పత్రాలు ఉన్నట్లు కనుగొన్నారు. లక్షా 50 వేల రూపాయిల విషయంలో నెలకొన్న వివాదం చివరికి హత్యకు దారితీసిందని బీహార్ పోలీసులు వెల్లడించారు. కేవలం కాజిమ్, సాహ్ని మధ్య అప్పు వ్యవహరమే హత్యకు కారణమా.. లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Bengaluru: స్థానిక కోటాపై వెనక్కి!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 18 , 2024 | 07:30 AM

Advertising
Advertising
<