ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mamata Banerjee: ఇండియా కూటమి సారథ్యానికి సై

ABN, Publish Date - Dec 08 , 2024 | 05:18 AM

అవకాశం ఇస్తే ఇండియా కూటమికి నేతృత్వం వహించడానికి తాను సిద్ధమేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత అన్నారు.

బెంగాల్‌ నుంచే నడిపిస్తా

ప్రతిపక్షాల కూటమిని పెట్టింది నేనే: మమత

మమతకు జైకొట్టిన ఎస్పీ, ఉద్ధవ్‌ శివసేన

కాంగ్రెస్‌ ప్రదర్శనకు టీఎంసీ, ఎస్పీ డుమ్మా

కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి: సీపీఐ

మమత సమర్థతను ప్రశ్నించిన కాంగ్రెస్‌

కోల్‌కతా, డిసెంబరు 7: అవకాశం ఇస్తే ఇండియా కూటమికి నేతృత్వం వహించడానికి తాను సిద్ధమేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత అన్నారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి వరుస పరాజయాల నేపథ్యంలో మమత వ్యాఖ్య ఆ కూటమిలో అలజడి రేపుతోంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ న్యూస్‌ చానల్‌కు శనివారం మమత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియా కూటమి పనితీరు పట్ల ఆమె పెదవి విరిచారు. అటు ముఖ్యమంత్రి పదవినీ, ఇటు ‘ఇండియా’ పగ్గాలనూ సమన్వయం చేయగలనని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ‘‘ఇండియా’ కూటమిని నేనే ఏర్పాటుచేశాను. ఆ కూటమి బాగోగులు ఇప్పుడు దానిని నడిపిస్తున్నవారిని బట్టే ఉంటాయి’’ అంటూ కాంగ్రెస్‌ పార్టీకి పరోక్షంగా చురకలు వేశారు. ‘కూటమి పగ్గాలను మీరు చేపడతారా’ అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అవకాశం వస్తే తప్పకుండా ఆ బాధ్యతను తీసుకుంటానని ఆమె తెలిపారు. బెంగాల్‌ నుంచే కూటమిని నడిపిస్తానన్నారు.


కాంగ్రెస్‌ ప్రదర్శనకు టీఎంసీ, ఎస్పీ డుమ్మా

ఇండియా కూటమి, కాంగ్రెస్‌ తమ అహం పక్కనబెట్టి మమతాబెనర్జీ నాయకత్వాన్ని అంగీకరించాలని తృణమూల్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ శుక్రవారం వ్యాఖ్యానించారు. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో మెరుగ్గా కనిపించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఆ తర్వాత నుంచి మాత్రం తన రాజకీయ పట్టును కోల్పోతూ వస్తోంది. మరోవైపు.. బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని తృణమూల్‌ మట్టి కరిపించింది. దీంతో ‘ఇండియా’కు కాంగ్రెస్‌ సారథ్యంపై కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమి సారథ్యం విషయంలో మమత వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిది ఉదయ్‌వీర్‌ సింగ్‌ ప్రకటించారు. మమత ‘ఇండియా’ కూటమిలో ప్రధాన నాయకురాలిగా ఉండాలని కోరుకుంటున్నామని శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే) అగ్రనేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. కోల్‌కతా వెళ్లి దీనిపై ఆమెతో చర్చిస్తామని ఆయన తెలిపారు. కాగా, మమత ప్రతిపాదనను కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించింది. జాతీయ నేతగా మమత సమర్థతను ప్రశ్నించింది. ఇదిలాఉండగా, అదానీ అవినీతిపై కాంగ్రెస్‌ నిర్వహించిన నిరసన ప్రదర్శనకు తృణమూల్‌, ఎస్పీ దూరంగా ఉన్నాయి.


మహా వికాస్‌ అఘాడీకి ఎస్పీ గుడ్‌బై!

ముంబై, డిసెంబరు 7: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన షాక్‌ నుంచి ఇంకా తేరుకోని మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) కూటమికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ విపక్ష కూటమి నుంచి తమ పార్టీ తప్పుకోవాలని నిర్ణయించినట్టు శనివారం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మహారాష్ట్ర చీఫ్‌, ఎమ్మెల్యే అబు అజ్మీ ప్రకటించారు. మహారాష్ట్రలో ఇటీవలి ఓటమి అనంతరం ఎంవీఏ కూటమిలోని శివసేన(యూబీటీ) హిందూ అజెండాను ఎత్తుకున్నట్టు ఆయన ఆరోపించారు. శివసేన(యూబీటీ) ఎమ్మెల్సీ మిలింద్‌ నర్వేకర్‌ బాబ్రీ మసీదు కూల్చివేతను ఇటీవల ప్రశంసించారు. ఇదే ఎస్పీ ఆగ్రహానికి దారితీసినట్టు తెలుస్తోంది.

Updated Date - Dec 08 , 2024 | 05:18 AM