ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Adhir Ranjan: బీజేపీ భయంతోనే మమత స్వరం మారింది..

ABN, Publish Date - Feb 03 , 2024 | 06:35 PM

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావడం కూడా అనుమానమేనంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. మమత బీజేపీకి భయపడే ఆ పార్టీ భాషలోనే మాట్లాడుతున్నారని ముర్షీదాబాద్‌లో శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

ముర్షిదాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావడం కూడా అనుమానమేనంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) మండిపడ్డారు. మమత బీజేపీకి భయపడే ఆ పార్టీ భాషలోనే మాట్లాడుతున్నారని ముర్షీదాబాద్‌లో శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


''కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు రావాలని అటు బీజేపీ కానీ, ఇటు మమతా బెనర్జీ కానీ కోరుకోవడం లేదు. ఇండియా (I.N.D.I.A.) బ్లాక్ నేతగా ఉంటూ కూడా మమత ఇలా మాట్లాడటం దురదృష్టకరం. ఆమె తనంత తానుగానే ఇండియా కూటమిలో చేరారు. బీజేపీని చూసి ఆమె భయపడుతున్నారు. అందుకే ఆమె వైఖరి మారింది'' అని అధీర్ రంజన్ అన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందని బీజేపీ అంటోందని, కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని మమత చెబుతున్నారు. బీజేపీ, దీదీ ఒకే భాషలో ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ చెబుతున్న మాటనే ఇప్పుడు మమత బెనర్జీ చెబుతున్నారని విమర్శించారు.


యాత్ర జాప్యంపై విసుర్లు..

పశ్చిమబెంగాల్‌లో రాహుల్ యాత్రకు కలుగుతున్న జాప్యంపై అధీర్ రంజన్ మండిపడ్డారు. యాత్ర సాధ్యం కాదని స్థానిక యంత్రాగం శుక్రవారం రాత్రి నుంచి చెబుతూ వస్తోందని, పరీక్షలు జరుగుతున్నాయని అంటోందని అన్నారు. ఆ విషయాన్ని తాము ఒప్పుకుంటామని, అయితే ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం విద్యార్థులు ఉదయం 8.30 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షలు 10 గంటల నుంచి ఒంటిగంట వరకూ నిర్వహించాల్సి ఉందని చెప్పారు. అయితే తాము ప్రశాంతంగా జార్ఖాండ్‌కు బయలుదేరి వెళ్లాలనుకుంటున్నామని, రాహుల్ మహా అయితే మరో 2 నుంచి 4 గంటలే బెంగాల్‌లో ఉంటారని అన్నారు. ప్రశాంతంగా జార్ఖాండ్ వెళ్లేందుకు సహకరించాలని తాము అధికారులను కోరామని చెప్పారు.

Updated Date - Feb 03 , 2024 | 06:35 PM

Advertising
Advertising