ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Wayanad Landslides: నాలుగు మృతదేహాలే దొరికాయంటూ మన్సూర్ ఆవేదన

ABN, Publish Date - Aug 05 , 2024 | 08:37 AM

ప్రకృతి సృష్టించిన బీభత్సంతో వయనాడ్‌లో ఎటు చూసిన విషాదమే. ఇప్పటికే మృతుల సంఖ్య 365 దాటింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బీభత్సంలో చాలా కుటుంబాలు.. తమ కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నాయి. ఈ ఘటన చోటు చేసుకుని వారం రోజులవుతుంది. అయితే నేటికి తమ కుటుంబ సభ్యుల జాడ తెలియక పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

తిరువనంతపురం, ఆగస్ట్ 05: ప్రకృతి సృష్టించిన బీభత్సంతో వయనాడ్‌లో ఎటు చూసిన విషాదమే. ఇప్పటికే మృతుల సంఖ్య 365 దాటింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బీభత్సంలో చాలా కుటుంబాలు.. తమ కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నాయి. ఈ ఘటన చోటు చేసుకుని వారం రోజులవుతుంది. అయితే నేటికి తమ కుటుంబ సభ్యుల జాడ తెలియక పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

Also Read: Gold Rates Today: శ్రావణమాసం వచ్చేసింది.. ఇక బంగారానికి ఫుల్ డిమాండ్


16 మంది కుటుంబసభ్యులను పొగొట్టుకున్న మన్సూర్..

అందుకు వయనాడ్‌లోని చూరల్మల వాసి మన్సూర్ కథే అందుకు ఉదాహరణ. జులై 30న నాటి విపత్తులో 42 ఏళ్ల మన్సూర్.. తన 16 మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాడు. వారిలో అతడి తల్లి, భార్య, ఇద్దరు కుమారులు, సోదరితోపాటు వదిన కుటుంబంలోని 11 మంది విగత జీవులుగా మారారు. అయితే అతడి కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలే ఇప్పటి వరకు లభించాయి. దీంతో మిగిలిన వారి మృతదేహాలను సైతం గాలించాలని ఆర్మీని అతడు కోరుతున్నాడు. ఆ క్రమంలో మన్సూర్ కన్నీరుమున్నీరు అవుతున్నాడు.


ఈ విపత్తు తన ప్రపంచాన్ని దూరం చేసింది..

తన నుంచి తన ప్రపంచాన్ని ఈ విపత్తు దూరం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నా కుటుంబం, నా ఇల్లు, నా సమస్తం అన్ని వెళ్లి పోయాయంటూ గత ఆరు రోజులుగా తన కుటుంబ సభ్యుల మృతదేహాల కోసం ఎదురు చూస్తున్న అతడు కన్నీటి పర్యంతమవుతు చెప్పాడు. అయితే ఈ విపత్తు చోటు చేసుకున్న రోజు.. తాను పని మీద మరో ప్రదేశానికి వెళ్ల వలసి వచ్చిందని చెప్పాడు. దీంతో తాను ప్రాణాలతో ఇలా మిగిలిపోయానని తీవ్ర నైరాశ్యంతో తెలిపారు.


నేటికి కుమార్తె మృతదేహం కోసం గాలింపు..

ఈ రోజు వరకు తన కుమార్తె మృతదేహం మాత్రం కనిపించ లేదన్నాడు. కానీ దొరికిన నాలుగు మృతదేహాల్లో.. తన తల్లి, తన కుమారుడు, తన సోదరి, తన భార్య మాత్రమే ఉన్నాయని వివరించాడు. నేటికి తన కుమార్తె మృతదేహం కోసం గాలిస్తున్నాని చెప్పారు. ప్రస్తుతం తాను తన సోదరుడి ఇంట్లో తాను తలదాచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విపత్తు తమ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిందని మన్పూర్ సోదరుడు నాసిర్ స్పష్టం చేశారు.

ఇంకా ఏడు మృతదేహాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నామని సోదరుడు నాసిర్, మన్సూర్ ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు వందలాది మంది ఆచూకీ తెలియకుండా పోయింది. వారి కోసం వరుసగా ఆరో రోజు సైతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అందుకోసం రాడార్‌ సేవలను ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వినియోగించుకుంటున్నాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 05 , 2024 | 08:37 AM

Advertising
Advertising
<