ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jaipur: రూ.10 లక్షల బేరం.. అభ్యర్థికి బదులు నీట్ యూజీ పరీక్ష రాసిన మరొకరు

ABN, Publish Date - May 06 , 2024 | 11:14 AM

ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరకిపోయిన ఘటన రాజస్థాన్‌లో(Rajasthan) జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీ(NEET - UG) పరీక్షలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పుర్‌ జిల్లాలో అభ్యర్థికి బదులు పరీక్ష రాస్తూ ఓ ఎంబీబీఎస్ విద్యార్థి పట్టుబడ్డాడు.

జైపూర్‌: ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసి అడ్డంగా దొరకిపోయిన ఘటన రాజస్థాన్‌లో(Rajasthan) జరిగింది. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీ(NEET - UG) పరీక్షలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పుర్‌ జిల్లాలో అభ్యర్థికి బదులు పరీక్ష రాస్తూ ఓ ఎంబీబీఎస్ విద్యార్థి పట్టుబడ్డాడు. మథుర ప్రాంతాంలో ఓ పరీక్ష కేంద్రంలోని అభ్యర్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు ఇన్విజిలేటర్ గుర్తించాడు.


అతడి హాల్ టికెట్, ధ్రువపత్రాలను తనిఖీ చేయగా.. పరీక్ష రాసే అభ్యర్థి వేరని తేలింది. దీంతో ఇన్విజిలేటర్ పోలీసులకు ఫోన్ చేసి నిందితుడిని వారికి అప్పగించాడు. విచారణ సందర్భంగా నిందితుడు తన పేరు అభిషేక్‌ గుప్తా అని, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేస్తున్నాని చెప్పాడు.

రాహుల్‌ అనే తన సహ విద్యార్థికి బదులు తాను పరీక్ష రాస్తున్నాని చెప్పాడు. పరీక్ష రాయడానికిగానూ అతని నుంచి రూ.10 లక్షలు తీసుకున్నామని తెలిపాడు. పరీక్ష రాయడానికి తనతో పాటు మరో నలుగురు ఉన్నారని పోలీసులకు తెలిపాడు. తన తోటి విద్యార్థి రవి కోసమే పరీక్ష రాసినట్లు అంగీకరించాడు. మిగతా 5 మంది పరీక్ష కేంద్రానికి సమీపంలోనే ఉన్నట్లు చెప్పాడు. దీంతో పరీక్ష రాయాల్సిన అసలు విద్యార్థి రాహుల్‌ సహా మిగతా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

For Latest News and National News click here

Updated Date - May 06 , 2024 | 11:14 AM

Advertising
Advertising