ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bulldozer Action: ఢిల్లీ ఘటనతో రంగంలోకి ఎంసీడీ.. బుల్డోజర్ చర్యలు షురూ

ABN, Publish Date - Jul 29 , 2024 | 04:00 PM

వరద నీరు పోటెత్తి ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్లోకి రావడంతో ముగ్గురు సివిల్ ఆశావహులు మృతి చెందిన ఘటన సంచలనం కావడంతో ఢిల్లీ మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాజేంద్ర నగర్ ఏరియాలో బుల్డోజర్ చర్యలకు దిగింది.

న్యూఢిల్లీ: వరద నీరు పోటెత్తి ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్లోకి రావడంతో ముగ్గురు సివిల్ ఆశావహులు మృతి చెందిన ఘటన సంచలనం కావడంతో ఢిల్లీ మున్సిపల్ యంత్రాంగం (MCD) అప్రమత్తమైంది. రాజేంద్ర నగర్ ఏరియాలో బుల్డోజర్ చర్యలకు (Bulldozer Action) దిగింది. మురుగుకాలువల్లోకి వరదనీరు వెళ్లకుండా వాటికి అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత పనులను చేపట్టింది. భారీ మెషనరీని రంగంలోకి దింపారు. బిల్డింగ్ నిబంధనలను ఉల్లంఘించిన 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లను సీల్ చేసిన ఎంసీడీ, తదుపరి చర్యలుగా బుల్డోజర్ చర్యలకు దిగినట్టు అధికారులు పేర్కొన్నారు.


కాగా, ఢిల్లీ మృతుల ఘటనలో ఎంసీడీ అధికారుల నిర్లక్ష్యం ఉందా అనే దానిపై విచారణకు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆదేశించారు. స్థానిక జూనియర్ ఇంజనీర్‌ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినికుమార్‌ టెర్మినేట్ చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేశారు. వరదనీరు డ్రైనేజ్‌లోకి వెళ్లకుండా నిరోధిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చేయాలని చిరకాలంగా కోరుతున్నా ఎంసీడీ పట్టించుకోలేదని, ఆ నిర్లక్ష్యమే రాజేంద్రనగర్ దుర్ఘటనకు దారితీసిందని ఎంసీడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యార్థుల మృతిపై నిరసనలు పెల్లుబుకడం, ప్రభుత్వ క్రిమినల్ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమంటూ స్టూడెంట్లు ఆందోళనలకు దిగడం వంటివి చోటుచేసుకున్నాయి.

UPSC aspirants’ death: ఈ ప్రమాదానికి ముందు దృశ్యాల వీడియో వైరల్


కాగా, ఘటనకు 12 రోజుల క్రితమే స్థానిక కౌన్సిలర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఘటనా ప్రాంతానికి వచ్చిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌ వద్ద విద్యార్థులు వాపోయారు. ఈ నేపథ్యంలో ఎంసీడీ 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లను సీజ్ చేసి బుల్డోజర్ చర్యలకు దిగింది. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 04:00 PM

Advertising
Advertising
<