MEA Memo: కెనడాలోని భారత దౌత్యవేత్తలకు కేంద్రం సీక్రెట్ మెమో.. ఇందులో నిజమెంత
ABN, Publish Date - Nov 08 , 2024 | 06:17 PM
హింసాత్మక నేరాలతో భారత దౌత్యవేత్తలకు లింక్ ఉందనే అనుమానాలకు తావిచ్చే ఒక మెమో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2023 ఏప్రిల్ తేదీతో ఉన్న ఈ మెమోను మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వత్రా జారీ చేసినట్టుగా ఉంది.
న్యూఢిల్లీ: అసలే భారత్-కెనడా (India-Canada) మధ్య దౌత్యసంబంధాలు ఉప్పూనిప్పూ తరహాలో ఉన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో ఒక వార్త సందడి చేస్తోంది. అక్కడి భారత దౌత్యవేత్తలకు కేంద్ర ప్రభుత్వం సీక్రెట్ మెమో (Mem) ఇచ్చినట్ట ఆ వార్తా కథనం సారాంశం. దీనిపై భారత విదేశాంగ శాఖ (MEA) శుక్రవారంనాడు స్పందించింది. భారత ప్రభుత్వం అలాంటి మెమో ఏదీ జారీ చేయలేదని, అది నకిలీ మెమో అని స్పష్టం చేసింది.
370 అధికరణపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
మెమోలో ఏముంది?
హింసాత్మక నేరాలతో భారత దౌత్యవేత్తలకు లింక్ ఉందనే అనుమానాలకు తావిచ్చే ఒక మెమో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2023 ఏప్రిల్ తేదీతో ఉన్న ఈ మెమోను మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వత్రా జారీ చేసినట్టుగా ఉంది. కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదులను అడ్డుకునేందుకు భారత మూలాలున్న గ్రూపులైన బలమైన దళాన్ని ఏర్పాటు చేయాలంటూ భారత దౌత్యవేత్తలను ఆదేశించినట్టు ఆ మెమోలో ఉంది. ఆ గ్రూపుల పేర్లలో ఇండో-కెనడా అసోసియేషన్ (ఐసీఏ) ఇండో-కెనడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీసీ), టిఐఈ సిలికాన్ వాలీ (టిఐఇ ఎస్‌వీ), యుఎస్ఐబీసీ తదిరుల ప్రస్తావన కూడా ఉంది.
ఖలిస్థాన్ అనుకూలవాది నిజ్జర్ గత ఏడాది కెనడాలో హత్యకు గురికావడం, ఆ హత్య వెనుక భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడం మొదలైంది. భారత్ ఈ ఆరోపణలను నిర్ద్వందంగా ఖండించంతో పాటు సాక్ష్యాలు ఉంటే అందజేయాలని సూచించింది. అయితే కెనడా ఎలాంటి సాక్షాలు చూపకుండానే నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరు ఇటీవల చేర్చడం ద్వారా మరోసారి కయ్యానికి కాలుదువ్వింది. ఈ క్రమంలో వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. ఢిల్లీలోని తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఈ క్రమంలోని కెనడాలోని బ్రాంప్టన్ హిందూ సభ దేవాలయంపై ఖలిస్థానీ సానుభూతిపరులు ఇటీవల దాడికి దిగడంతో భారత్ మరోసారి భగ్గుమంది. ఖలిస్తానీ వేర్పాటువాదులకు కెనడా 'సేఫ్ హెవెన్' గా మారినట్టు ట్రుడో సర్కార్ చర్చలు ఉన్నాయంటూ తీవ్ర ఆక్షేపణ తెలిపింది.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్‌కు రాహుల్ గాంధీ లేఖ
CM Sukhu: సీఎం తినాల్సిన సమోసాలు ఎవరు తిన్నారు.. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు
For More National and telugu News
Updated Date - Nov 08 , 2024 | 06:17 PM