Viral Video: కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో C130J విమానం అర్ధరాత్రి ల్యాండింగ్
ABN, Publish Date - Jan 07 , 2024 | 02:08 PM
IAF C130J విమానం మొదటిసారిగా కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో రాత్రి రాత్రే విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రతికూల వాతావరణంలో కూడా ఈ మిషన్ నిర్వహించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత వైమానిక దళం తాజాగా మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. వైమానిక దళానికి చెందిన C130J సూపర్ హెర్క్యులస్ విమానం మొదటిసారిగా కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్(Kargil airstrip)లో రాత్రికి రాత్రే ల్యాండ్ అయ్యి విజయం సాధించింది. ఆ సమయంలో వైమానిక దళానికి చెందిన గరుడ కమాండోలు కూడా విమానంలో ఉన్నారు. కమాండోల శిక్షణలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో త్వరగా ఎలా మోహరించాలనే దానిపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియోను IAF సోషల్ మీడియాలో పంచుకుంది.
వీడియోలో గరుడ కమాండోలతో కూడిన ప్రత్యేక దళం లైట్లు వేసుకుని లోకేషన్ ట్రాక్ చేస్తు వచ్చిన వీడియో ఆకట్టుకుంటుంది. గ్రూపు మొత్తం ఒక్కరొక్కరుగా వస్తున్న దృశ్యం ఓ సినిమాలో సీన్ మాదిరిగా అనిపిస్తుంది. ఇది చూసిన పలువురు వావ్ అని అంటున్నారు. కష్టతరమైన ఎత్తైన పరిస్థితుల్లో కూడా విమానం రాత్రి సమయంలో ల్యాండ్ చేయడం గ్రేట్ అని చెబుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Japan: భూకంపం ధాటికి కకావికలమైన తీరం.. శాటిలైట్ ఫొటోలు చూడండి
కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ 8800 అడుగుల ఎత్తులో ఉంది. ఆ ఎత్తులో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, బలమైన గాలులు ఎక్కువగా వీస్తుంటాయి. అటువంటి పరిస్థితిలో అక్కడ ఫ్లైట్ ల్యాడ్ చేయాలంటే అధిక స్థాయి సాంకేతిక నైపుణ్యంతోపాటు శిక్షకులు కూడా అవసరం. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైమానిక దళం తన దళాలను త్వరగా మోహరించగలదని ఈ వీడియో ద్వారా ఎట్టకేలకు నిరూపించింది.
అంతకుముందు ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఉత్తరాఖండ్‌లోని ధరాసులో సూపర్ హెర్క్యులస్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేశారు. ధరాసులో దిగిన ఆ ప్రదేశం 3000 అడుగుల ఎత్తులో ఉంది. అమెరికా లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసిన C130J సూపర్ హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానం వైమానిక దళంలోని 12వ ఫ్లీట్‌లో భాగంగా ఉంది.
Updated Date - Jan 07 , 2024 | 02:08 PM