MiG-29 Fighter Jet: ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 విమానం
ABN, Publish Date - Nov 04 , 2024 | 05:47 PM
వైమానిక విన్యాసాల కోసం ఫైటర్ జెట్ పంజాబ్‌లోని అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం కుప్పకూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై విచారణ ఆదేశించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) సమీపంలో మిగ్-29 (MiG-29) యుద్ధ విమానం సోమవారంనాడు కుప్పకూలింది. అయితే విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. వైమానిక విన్యాసాల కోసం ఫైటర్ జెట్ పంజాబ్‌లోని అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం కుప్పకూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై విచారణ ఆదేశించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
Maharashtra: ఎన్నికల వేళ డీజీపీపై ఈసీ బదిలీ వేటు
విమానం కుప్పకూలడానికి కొద్ది ముందే పైలెట్ల్ ఇద్దరూ విమానం నుంచి దూకేయడంతో సురక్షితంగా బయటపడినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కగారోల్ లోని సోనిగ గ్రామం సమీపంలోని పొలాల మధ్యలో ఫైటర్ జెట్ కూలగడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విమానం నేలకు తాగగానే ముక్కచెక్కలైందని, మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని స్థానికులు తెలిపారు.
కాగా, మిగ్-29 విమానం కుప్పకూలిన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 2న రాజస్థాన్‌లోని బర్మెర్‌లో మిగ్-29 కుప్పకూలింది. సాంకేతిక కారణాలతో జెట్ కుప్పకూలగా, పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాయి. బర్మెర్ సెక్టార్‌లోని ఎయిర్ ఫోర్స్ బేస్‌లో శిక్షణా విమానంగా దీన్ని వినియోగిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ బుకింగ్, ట్రాకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 04 , 2024 | 05:53 PM